Ishani Chakkilam: ఐదేళ్ల ఏళ్ల చిన్నారి.. అద్భుత చెస్ ఘనత!
ఐదేళ్ల చిన్నారి ఇషాని చక్కిలం, అద్భుతమైన చెస్ సాధనతో ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది.
కేవలం 9.23 నిమిషాల్లో 104 చెక్‌మేట్-ఇన్-వన్-మూవ్ పజిల్స్‌ను పరిష్కరించి వరల్డ్ రికార్డు నెలకొల్పింది.
ఈ అద్భుత ఘనతతో ఇషాని భారతదేశం, ప్రపంచ చెస్ చరిత్రలో తన పేరును లిఖించుకుంది. ఇషాని రాయ్ చెస్ అకాడమీకి చెందిన ప్రతిభావంతురాలి. చిన్న వయసులోనే అసాధారణమైన నైపుణ్యం, దృఢ సంకల్పంతో ఈ ఘనత సాధించింది.
తల్లిదండ్రులు శ్రీకాంత్, శ్రావ్య చక్కిలం ఇషాని ప్రతిభను గుర్తించి, ఆమెను ప్రోత్సహిస్తున్నారు. రాయదుర్గంలో జరిగిన ఈ ఈవెంట్‌కు మంత్రి కొండా సురేఖ, బ్రిటిష్ డిప్యూటీ హై-కమిషనర్ గారెత్ విన్ ఓవెన్ హాజరయ్యారు.
Norway Chess Tournament: ప్రపంచ నంబర్‌వన్‌పై నెగ్గిన భారత టీనేజ్ గ్రాండ్‌మాస్టర్!
#Tags