Paralympics: పారాలింపిక్స్‌లో వరుసగా ఐదోసారి పసిడి పతకం సాధించిన‌ రౌవా తిలీ

ప్యారిస్‌ వేదికగా జరుగుతున్న పారాలింపిక్స్‌లో ట్యునీషియాకు చెందిన రౌవా తిలీ షాట్‌పుట్‌ ఎఫ్‌41 విభాగంలో స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది.

వరుసగా ఐదో పారాలింపిక్స్‌లో ఆమె పసిడి పతకం గెలుచుకుంది. ఈ విజయంతో రౌవా తిలీ తన ఓవరాల్‌ ఒలింపిక్‌ స్వర్ణాల సంఖ్యను ఏడుకు చేర్చారు.

దీంతో పాటు మరో 2 రజతాలు కూడా ఆమె సాధించింది. 2008లో డిస్కస్‌ త్రోలో స్వర్ణం సాధించిన రౌవా, 2012లో షాట్‌పుట్‌లో బంగారు పతకాన్ని అందుకుంది. ఆ తర్వాత 2016, 2020లలో అటు షాట్‌పుట్‌లో, ఇటు డిస్కస్‌లో రెండేసి స్వర్ణాల చొప్పున నెగ్గింది. 34 ఏళ్ల రౌవా తిలీ ఎత్తు 4.4 అడుగులు మాత్రమే కావడం విశేషం. 

Jannik Sinner: ఈ ఏడాది ఐదో టైటిల్‌ సొంతం టెన్నిస్‌ స్టార్ ఈయ‌నే..

#Tags