Carlos Alcaraz: ‘ఫ్రెంచ్ కింగ్’ అల్‌కరాజ్.. ఎంత ప్రైజ్‌మనీ సొంతం చేసుకున్నాడంటే..
జూన్ 9వ తేదీ ముగిసిన టెన్నిస్ సీజన్ రెండో గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ ఫ్రెంచ్ ఓపెన్‌లో అతి చిన్న వయస్సులోనే(21 ఏళ్లు) అల్‌కరాజ్ చాంపియన్‌గా అవతరించాడు.
4 గంటల 19 నిమిషాలపాటు జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ మూడో ర్యాంకర్ అల్‌కరాజ్ 6–3, 2–6, 5–7, 6–1, 6–2తో ప్రపంచ నాలుగో ర్యాంకర్ అలెగ్జాండర్ జ్వెరెవ్‌పై విజయం సాధించాడు. విజేతగా నిలిచిన అల్‌కరాజ్‌కు 24 లక్షల యూరోలు (రూ.21 కోట్ల 71 లక్షలు), రన్నరప్ జ్వెరెవ్‌కు 12 లక్షల యూరోలు (రూ.10 కోట్ల 84 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి.
➤ ఓపెన్ శకంలో (1968 తర్వాత) మూడు ఉపరితలాలపై గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ నెగ్గిన పిన్న వయస్కుడిగా అల్‌కరాజ్ (21 ఏళ్లు) గుర్తింపు పొందాడు. గతంలో ఈ రికార్డు రాఫెల్ నాదల్ (23 ఏళ్లు) పేరిట ఉంది. హార్డ్ కోర్టులపై 2022 యూఎస్ ఓపెన్ నెగ్గిన అల్‌కరాజ్, 2023లో పచ్చిక కోర్టులపై వింబుల్డన్ టైటిల్ నెగ్గాడు.
French Open title: నాలుగో సారి ఫ్రెంచ్ ఓపెన్ గెలిచిన పోలండ్ స్టార్.. ఆమె ఎవరంటే..
➤ టెన్నిస్‌లోని మూడు గ్రాండ్‌స్లామ్ టోర్నీల (ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్, యూఎస్ ఓపెన్) టైటిల్స్ సాధించిన ఏడో ప్లేయర్‌గా అల్‌కరాజ్ ఘనత వహించాడు. రాఫెల్ నాదల్ (స్పెయిన్), మాట్స్ విలాండర్ (స్వీడన్), జిమ్మీ కానర్స్ (అమెరికా), రోజర్ ఫెడరర్ (స్విట్జర్లాండ్), జొకోవిచ్ (సెర్బియా), ఆండ్రీ అగస్సీ (అమెరికా) గతంలో ఈ ఘనత సాధించారు.
➤ కెరీర్‌లో ఫైనల్ చేరిన మొదటి మూడు గ్రాండ్‌స్లామ్ ఫైనల్స్‌లో విజేతగా నిలిచిన ఏడో ప్లేయర్‌గా అల్‌కరాజ్ నిలిచాడు. గతంలో గుస్తావో కుయెర్టన్ (బ్రెజిల్), స్టీఫెన్ ఎడ్బర్గ్ (స్వీడన్), జాన్ బోర్గ్ (స్వీడన్), ఫెడరర్, జిమ్మీ కానర్స్, వావ్రింకా (స్విట్జర్లాండ్) ఈ ఘనత సాధించారు.
➤ నాదల్, సాంటానా, గిమెనో, సెర్గీ బ్రుగుయెరా, కార్లోస్ మోయా, అల్బెర్ట్ కోస్టా, కార్లోస్ ఫెరీరో తర్వాత ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ నెగ్గిన ఎనిమిదో స్పెయిన్ ప్లేయర్‌గా అల్‌కరాజ్ నిలిచాడు.
Paris Olympics: పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన భారత బాక్సర్లు వీరే..