Asian Para Games: ఆసియా పారా క్రీడల్లో హ్యాట్రిక్ ప‌త‌కాలు సాధించిన‌ శీతల్‌ దేవి

తన వైకల్యమే కుంగిపోయేలా... ఆత్మవిశ్వాసానికి నిలువుటద్దంలా భారత క్రీడాకారిణి శీతల్‌ దేవి ఆసియా పారా క్రీడల్లో పతకాల ‘హ్యాట్రిక్‌’ సాధించింది. కశ్మీర్‌కు చెందిన 16 ఏళ్ల ఈ టీనేజ్‌ ఆర్చర్‌కు రెండు చేతులు భుజాల నుంచే లేవు.
Sheetal Devi scored hat-trick medals Asian Para Games 2023

 మరి రెండు చేతులు తప్పక కావాల్సిన విలువిద్యలో ఆమె పతకాలపై గురిపెట్టడం ఏంటని ఆశ్చర్యం కలుగకమానదు. శీతల్‌ కాళ్లతో విల్లును నిటారుగా నిలబెట్టి, నోటితో బాణాన్ని లాగిపట్టి... లక్ష్యంపై గురిపెట్టే ఆమె ప్రావీణ్యానికి జేజేలు పలకాల్సిందే! ఆమె ప్రదర్శన ముందు వైకల్యం పూర్తిగా ఓడిపోయింది.

Asian Shooting Championship 2023: ఆసియా చాంపియన్‌షిప్‌లో భారత షూటర్ల జోరు

ఈ ఆసియా పారా క్రీడల్లో రెండు స్వర్ణాలు, ఒక రజతంతో ఆమె ‘హ్యాట్రిక్‌’ సాధించింది. ఇంతకుముందు మహిళల కాంపౌండ్‌ టీమ్‌ విభాగంలో రజతం నెగ్గిన ఆమె రాకేశ్‌ కుమార్‌తో కలిసి గురువారం మిక్స్‌డ్‌ టీమ్‌ ఈవెంట్‌లో స్వర్ణం సాధించింది.

శుక్రవారం జరిగిన వ్యక్తిగత విభాగం ఫైనల్లో శీతల్‌ దేవి 144–142తో అలీమ్‌ నూర్‌ సియాదా (సింగపూర్‌)పై గెలిచింది. తద్వారా ఒకే ఆసియా పారా ఈవెంట్‌లో రెండు బంగారు పతకాలు గెలిచిన తొలి భారత మహిళా అథ్లెట్‌గా రికార్డుల్లోకెక్కింది. ఇదే ఈవెంట్‌లో అంకుర్‌ రెండు స్వర్ణాలతో పురుష అథ్లెట్‌గా నిలిచాడు.

శుక్రవారం పారాలింపిక్‌ చాంపియన్‌ అయిన షట్లర్‌ ప్రమోద్‌ భగత్, మహిళల్లో తులస్మతి మురుగేశన్, పురుషుల డబుల్స్‌లో నితేశ్‌–తరుణ్‌ జోడీ బంగారు పతకాలు సాధించారు. ఒక్క బ్యాడ్మింటన్‌లోనే భారత్‌ ఖాతా లో తొమ్మిది పతకాలు చేరడం విశేషం.

Asian Para Games 2023: ఆసియా పారా క్రీడల షాట్‌పుట్‌లో స్వర్ణ పతకం

#Tags