Karthik Venkataraman: జాతీయ ఓపెన్‌ చెస్‌ చాంపియన్‌ కార్తీక్‌ వెంకటరామన్.. ప్రపంచకప్‌ టోర్నీకి అర్హత

ఆంధ్రప్రదేశ్‌ గ్రాండ్‌మాస్టర్‌ కార్తీక్‌ వెంకటరామన్‌ జాతీయ సీనియర్‌ చెస్‌ చాంపియన్‌గా అవతరించాడు.

హరియాణాలోని గురుగ్రామ్‌లో జరిగిన ఈ టోర్నీ ఆగ‌స్టు 27వ తేదీ ముగిసింది. నిర్ణీత 11 రౌండ్లకుగాను కార్తీక్‌తోపాటు సూర్యశేఖర గంగూలీ (పెట్రోలియం స్పోర్ట్స్‌ ప్రమోషన్‌ బోర్డు), నీలేశ్‌ సాహా (రైల్వేస్‌) 9 పాయింట్లతో ఉమ్మడిగా అగ్రస్థానంలో నిలిచారు. 
 
అయితే మెరుగైన టైబ్రేక్‌ స్కోరు ఆధారంగా ర్యాంకింగ్‌ను వర్గీకరించగా.. కార్తీక్‌కు టైటిల్‌ వరించింది. కార్తీక్‌కు రూ.6 లక్షలు ప్రైజ్‌మనీ లభించింది. అలాగే.. 2025 ప్రపంచకప్‌ టోర్నీకి భారత్‌ తరఫున కార్తీక్‌ అర్హత సాధించాడు. 

సూర్యశేఖర గంగూలీ రన్నరప్‌గా నిలువగా, నీలేశ్‌ సాహా మూడో స్థానం దక్కించుకున్నాడు. మిత్రబా గుహ (రైల్వేస్‌)తో జరిగిన చివరిదైన 11వ రౌండ్‌ గేమ్‌లో నల్లపావులతో ఆడిన కార్తీక్‌ 58 ఎత్తుల్లో గెలిచాడు. కార్తీక్‌కిది రెండో జాతీయ టైటిల్‌. 2022లో అతను తొలిసారి జాతీయ చాంపియన్‌షిప్‌ టైటిల్‌ సాధించాడు. 

Asia Under 15: ఆసియా అండర్‌–15 బాలికల సింగిల్స్‌ విజేత ఈ అమ్మాయే..

#Tags