ONGC: కేజీ బేసిన్‌లో మరో బావి నుంచి ముడిచమురు, గ్యాస్ ఉత్పత్తి

ఆయిల్‌ అండ్‌ నేచురల్‌ గ్యాస్‌ లిమిడెట్‌ (ఓఎన్‌జీసీ) ముడిచమురు, గ్యాస్‌ ఉత్పత్తిని పెంచనుంది.

ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా-గోదావరి (కేజీ) బేసిన్‌కు చెందిన కేజీ-డీ5 బ్లాక్‌లో ఐదు నంబర్‌ బావి నుంచి ఉత్పత్తి ప్రారంభించినట్లు ఎక్స్ఛేంజీలకు సమాచారం అందించింది. దీనివల్ల రానున్న రోజుల్లో కంపెనీ ఆదాయం పెరగనుందని పేర్కొంది.

కృష్ణా గోదావరి (కేజీ) బేసిన్‌లో లోతైన సముద్ర ప్రాజెక్ట్‌లో ఐదో నంబర్‌ బావి నుంచి ఉత్పత్తి ప్రారంభించింది. ఈ ఏడాది జనవరిలో కేజీ-డీ5 బ్లాక్‌ నుంచి చమురు ఉత్పత్తి చేస్తున్నారు. అయితే ఇందులో నాలుగు బావుల నుంచి ఇప్పటి వరకు చమురు, గ్యాస్‌ వెలికి తీసేవారు. కానీ తాజాగా కేజీ-డీడబ్ల్యూఎన్‌-98/2 క్లస్టర్‌-2 అసెట్‌లో ఐదో చమురు బావిలో ఉత్పత్తి ప్రారంభమైనట్లు ఓఎన్‌జీసీ ఎక్స్ఛేంజీలకు సమాచారం అందించింది. ఈ కొత్త బావి వల్ల ముడిచమురు, సహజ వాయువు ఉత్పత్తి పెరుగుతుందని తెలిపింది.

ఇదిలా ఉండగా.. కొత్త బావి నుంచి ఎంత మొత్తంలో చమురు ఉత్పత్తి చేస్తారనే వివరాలను మాత్రం వెల్లడించలేదు. ఈ బావి ద్వారా చేస్తున్న చమురు, గ్యాస్‌ ఉత్పత్తి వల్ల దిగుమతులు తగ్గే అవకాశం ఉన్నట్లు కంపెనీ తెలిపింది. దాంతో రానున్న రోజుల్లో సంస్థ లాభాలు పెరిగే అవకాశం ఉందని పేర్కొంది.

Air Taxi: వినూత్న ప్రయోగం.. హైడ్రోజన్‌ ఎయిర్‌ ట్యాక్సీలు రెడీ

#Tags