ISRO Missions : 2024లో ఇస్రో చేపట్టనున్న కీలక ప్రయోగాలు ఇవే..

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) వచ్చే ఏడాది 10 కీలక ప్రయోగాలు చేపట్టనుందని కేంద్ర సహాయ మంత్రి జితేంద్ర సింగ్‌ రాజ్యసభలో వెల్లడించింది.
ISRO Lines Up 10 Key Missions In 2024

ఇందులో ఆరు పీఎస్‌ఎల్‌వీ మిషన్లు, మూడు జీఎస్‌ఎల్‌వీ ప్రయోగాలు, ఒక లాంచ్‌ వెహికల్‌ మార్క్‌–3 వాణిజ్య ప్రయోగం ఉందని తెలియజేసింది.

Agni-1 ballistic missile: అగ్ని–1 బాలిస్టిక్‌ క్షిపణి పరీక్ష విజయవంతం

వీటిలోపాటు ఇస్రో అభివృద్ధి చేసిన నూతన స్మాల్‌ శాటిలైట్‌ లాంచ్‌ వెహికల్‌(ఎస్‌ఎస్‌ఎల్‌వీ) ద్వారా ఒక ఉపగ్రహాన్ని ప్రయోగాత్మకంగా నింగిలోకి పంపించనున్నట్లు వివరించారు. ప్రతిష్టాత్మక గగన్‌యాన్‌ కార్యక్రమంలో భాగంగా కక్ష్య మాడ్యూల్‌ను నిర్ధారించుకొనేందుకు రెండు మానవ రహిత మిషన్లు చేపట్టాలని ఇస్రో భావిస్తోందని జితేంద్ర సింగ్‌ పేర్కొన్నారు.

Chandrayaan-3 Mision: భూ కక్ష్యకు ప్రొపల్షన్ మాడ్యుల్‌

#Tags