Agni-1 Ballistic Missile: అగ్ని–1 బాలిస్టిక్ క్షిపణి పరీక్ష విజయవంతం
Sakshi Education
స్వల్ప దూరాలను ఛేదించగల, ప్రయోగ దశలో ఉన్న బాలిస్టిక్ క్షిపణి అగ్ని–1ను విజయవంతంగా పరీక్షించినట్లు భారత రక్షణ శాఖ గురువారం ప్రకటించింది.
ఒడిశాలోని ఏపీజే అబ్దుల్ కలామ్ ద్వీపంలో ఈ పరీక్షకు వేదికైంది. ‘అగ్ని–1 అద్భుతమైన సత్తా ఉన్న క్షిపణి వ్యవస్థ. ఇప్పుడు దీనిని స్వల్ప దూర లక్ష్యాలకు పరీక్షించి చూస్తున్నాం.
Chandrayaan-3 Mision: భూ కక్ష్యకు ప్రొపల్షన్ మాడ్యుల్
గురువారం నాటి ప్రయోగంలో ఇది అన్ని క్షేత్రస్థాయి, సాంకేతిక పరామితులను అందుకుంది. రాడార్, టెలిమెట్రీ, ఎలక్ట్రో–ఆప్టికల్ సిస్టమ్ వంటి అన్ని ట్రాకింగ్ వ్యవస్థల ద్వారా దీని పనితీరును పరిశీలించాం. రెండు నౌకల ద్వారా క్షిపణి ఖచ్చితత్వాన్ని పర్యవేక్షించాం. ఇది చక్కగా పనిచేస్తోంది’’ అని రక్షణ శాఖ ఉన్నతాధికారి చెప్పారు. ఈ రకం క్షిపణిని చివరిసారిగా జూన్ ఒకటో తేదీన ఇదే వేదికపై విజయవంతంగా పరీక్షించారు.
Aditya-L1 Mission: సౌర గాలులను ఆధ్యయనం చేస్తున్న ఆదిత్య ఎల్–1
Published date : 08 Dec 2023 12:51PM