Impact Of Artificial Intelligence Technology: ‘AI’ వల్ల ఉద్యోగాలు పోవడం ఖాయం-చాట్‌జీపీటీ సృష్టి కర్త

ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (AI) శక్తి సామార్ధ్యాలు, జాబ్‌ మార్కెట్‌లో నెలకొన్న ఆందోళనలపై ఓపెన్‌ ఏఐ సీఈవో చాట్‌జీపీటీ మాస్టర్‌ మైండ్‌ శామ్‌ ఆల్ట్‌మన్‌ స్పందించారు.
Impact Of Artificial Intelligence Technology

చాట్‌జీపీటీ వల్ల మనుషులు చేస్తున్న ఉద్యోగాలు ప్రమాదంలో ఉన్నాయని బాహాటంగానే ఆందోళన వ్యక్తం చేశారు.చాట్‌జీపీటీ మానవ ఉద్యోగాలను పూర్తిగా భర్తీ చేయగలదా? అనే అంశంపై ఆయన మాట్లాడుతూ.. ఉద్యోగాల్లో మనుషుల అవసరం ఉందని, అయితే, చాట్‌జీపీటీ వల్ల ఇప్పటికే కొంతమంది ఉద్యోగాలు కోల్పోయారని, వారి స్థానాన్ని ఏఐ ఆక్రమించిందని పేర్కొన్నారు. కాగా, అభివృద్ధి చెందుతున్న ఏఐ పరిజ్ఞానంపై జరుగుతున్న చర్చల నేపథ్యంలో ఆల్ట్‌మన్‌ చేసిన ఈ వ్యాఖ్యలు చర్చాంశనీయంగా మారాయి.  

Sundar Pichai: కృత్రిమ మేధను తలచుకుంటే నిద్రలేని రాత్రులే.. గూగుల్‌ సీఈఓ సుందర్‌ పిచాయ్

ఇటీవల ఏఐపై జరిగిన ఇంటర్వ్యూల్లో ఆయన ఏం మాట్లాడారంటే:

నవంబర్ 2022 లో ప్రారంభించినప్పటి నుండి చాట్ జీపీటీ గణనీయమైన పురోగతిని సాధించిందని, మెరుగుపడుతూనే ఉంటుందని ఆల్ట్ మన్ అంగీకరించారు. అయితే, ఏఐ టూల్ పరిపూర్ణంగా లేదని, దానికి పరిమితులు ఉన్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.కృత్రిమ మేధ మానవ ఉద్యోగాల భర్తీకి దారితీస్తుందని ఆల్ట్ మన్ ఆందోళన వ్యక్తం చేశారు. భవిష్యత్తులో చాట్ జీపీటీ వంటి ఏఐ టూల్స్‌ హ్యూమన్స్‌ను భర్తీ చేయడంపై టెక్ నిపుణులతో సహా చాలా మంది ఈ తరహా అభిప్రాయం వ్యక్తం చేశారు.  

Open-Source AI: చాట్‌జీపీటీ, గూగుల్‌కు పోటీగా మెటా ఓపెన్ సోర్స్ ఏఐ

మానవాళిపై కృత్రిమ మేధ ప్రభావం పూర్తిగా సానుకూలంగా ఉండకపోవచ్చని ఆల్ట్ మన్ 'ది అట్లాంటిక్'కు ఇచ్చిన ఇంటర్వ్యూలో హెచ్చరించారు. కొంతమంది డెవలపర్లు కృత్రిమ మేధ కేవలం మానవ ప్రయత్నాలకు తోడ్పడుతుందని, ఉద్యోగాలను భర్తీ చేయదన్న అభిప్రాయాల్ని ఆల్ట్‌మన్‌ కొట్టిపారేశారు. ఉద్యోగాలు ఏఐకి ప్రభావితమవుతాయని నొక్కాణించారు. చాట్ జీపీటీ కంటే మరింత శక్తివంతమైన ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ టూల్స్‌ను తయారు చేసే సామర్థ్యం ఓపెన్ ఏఐకి ఉందని ఆయన వెల్లడించాడు. కానీ ఆ టూల్స్‌ ఇప్పట్లో విడుదల చేయకూడదని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఊహించని పరిణామాలను ఎదుర్కోవడం కష్టంగా ఉందని అన్నారు. 

భారత్ పర్యటన సందర్భంగా ఆల్ట్ మన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఉద్యోగ తరలింపుపై తన ఆందోళనలను పునరుద్ఘాటించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కారణంగా కొన్ని ఉద్యోగాలు కనుమరుగవుతాయని అంగీకరించిన చాట్‌జీపీటీ రూపకర్త కొత్త, మెరుగైన ఉద్యోగాలు కూడా పుట్టుకొస్తాయని నమ్ముతున్నారు. ఏఐపై భారత్‌ చూపిస్తున్న ఉత్సాహాన్ని ప్రశంసించారు. దేశంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టార్టప్స్‌కు సపోర్ట్‌ ఇవ్వడానికి ఓపెన్ఎఐ ప్రణాళికలను ప్రకటించారు.

TruthGPT: త్వరలో ‘చాట్‌జీపీటీ’కి ప్రత్యామ్నాయంగా ‘ట్రూత్‌జీపీటీ’.. ఎలాన్‌ మస్క్‌ ప్రకటన

చాట్ జీపీటీ సహా ఇతర ఏఐ టూల్స్‌ ప్రభావం జాబ్ మార్కెట్‌పై పడుతుందని ఓపెన్ ఏఐ సీఈఓ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గణనీయమైన పురోగతిని చూపించినప్పటికీ, ఇది సమాజానికి సవాళ్లను కూడా విసురుతోంది. జాబ్‌ మార్కెట్‌కు అంతరాయం కలగకకుండా సానుకూలంగా ఉపయోగించేలా జాగ్రత్తలు తీసుకోవడం అవసరమని పేర్కొన్నారు. 

ChatGPT: అనుకున్న‌దే అయ్యింది... ఉద్యోగాల‌కు ఎస‌రు పెట్టిన చాట్ బోట్స్‌.. నిరుద్యోగుల‌కు ఇక‌ నిద్ర‌లేని రాత్రులే

#Tags