VSHORADS: స్వల్పశ్రేణి గగనతల రక్షణ క్షిపణి పరీక్ష విజయవంతం

అతి స్వల్పశ్రేణి గగనతల రక్షణ క్షిపణి వ్యవస్థ (వీఎస్‌హెచ్‌ఓఆర్‌ఏడీఎస్‌)ను భారత్ అక్టోబ‌ర్ 5వ తేదీ విజయవంతంగా పరీక్షించింది.

రాజస్థాన్‌లోని పోఖ్రాన్‌ ఫైరింగ్‌ రేంజ్‌లో ఒకేరోజు మూడుసార్లు నిర్వహించిన క్షిపణి పరీక్షలు విజయవంతమయ్యాయి. ఈ అధునాతన క్షిపణి పరిమాణం చాలా చిన్నగా దీనిని సైనికులు భుజం మీద మోసుకెళ్లవ‌చ్చు. 

దీనిని హైదరాబాద్‌లోని రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో)కు చెందిన రీసెర్చ్‌ సెంటర్‌ ఇమారత్‌ (ఆర్‌సీఐ) రూపొందించింది. ఇందులో మినియేచరైజ్డ్‌ రియాక్షన్‌ కంట్రోల్‌ వ్యవస్థ, ఇంటిగ్రేటెడ్‌ ఏవియానిక్స్ ఉన్నాయి.

Mini Moon: త్వరలో భూ కక్ష్యలోకి బుల్లి గ్రహశకలం.. రెణ్నెల్లపాటు భూమి చుట్టూ చక్కర్లు

#Tags