AP State Aquaculture Development Authority: అప్సడా చైర్మన్‌గా ఎవరు వ్యవహరిస్తారు?

ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ ఆక్వాకల్చర్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (అప్సడా) వైస్‌ చైర్మన్‌గా వడ్డి రఘురాంను నియమిస్తూ మార్చి 4న రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ అథారిటీకి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చైర్మన్‌గా, రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు వైస్‌ చైర్మన్‌గా వ్యవహరిస్తారు. మరో వైస్‌ చైర్మన్‌గా రఘురాం నియమితులయ్యారు. వడ్డి రఘురాం మూడు దశాబ్దాలుగా ఆక్వారంగంలో ఉన్నారు.

ఇవీ లక్ష్యాలు 
ఆక్వాకల్చర్‌ కార్యకలాపాలన్నీ అప్పడా–2020 చట్టం పరిధిలోకి తెచ్చారు. సీడ్, ఫీడ్, నాణ్యతతో కూడిన ఉత్పత్తి, మార్కెట్‌ ధరలను ఈ చట్టం నియంత్రిస్తుంది. ఆక్వా ఉత్పత్తుల వాణిజ్యం, ఎగుమతులకు అనుకూలమైన వాతావరణాన్ని కల్పిస్తుంది. పంటకు అదనపు విలువ జోడించటం, సర్టిఫై చేసిన ఇన్‌పుట్స్‌ సరఫరా వంటి చర్యలు చేపడుతుంది.

శాప్‌ చైర్మన్‌గా ఎవరు ఉన్నారు?
రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి తీసుకొస్తున్న నూతన క్రీడా విధానం 2022–27 ప్రతిపాదనలకు ఆంధ్రప్రదేశ్‌ క్రీడా ప్రాధికార సంస్థ(శాప్‌) పాలక మండలి ఆమోదం తెలిపింది. మార్చి 4న విజయవాడలోని శాప్‌ కార్యాలయంలో చైర్మన్‌ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి, ఎండీ ఎన్‌.ప్రభాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో బోర్డు సమావేశమై కీలక నిర్ణయాలు తీసుకుంది. స్పోర్ట్స్‌ యాక్ట్‌–2022 ప్రకారం క్రీడా సంఘాలకు రిజిస్ట్రేషన్, రెగ్యులరైజేషన్‌ కోసం ప్రభుత్వాన్ని కోరేందుకు తీర్మానించింది.

Andhra Pradesh: భోగరాజు సీతారామయ్య మ్యూజియాన్ని ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు?

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ ఆక్వాకల్చర్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (అప్సడా) వైస్‌ చైర్మన్‌గా నియమితులైన వ్యక్తి?
ఎప్పుడు  : మార్చి 4
ఎవరు    : వడ్డి రఘురాం
ఎందుకు : రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు..

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా..
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

#Tags