NITI Aayog Report on Telangana: తెలంగాణలో ‘కుమురంభీం’ జిల్లాలో పేద‌లు ఎక్కువ‌

దేశం, తెలంగాణ రాష్ట్రంలో గత కొన్నేళ్లలో పేదరికం రికార్డు స్థాయిలో తగ్గిందని నీతి ఆయోగ్‌ నివేదిక వెల్లడించగా, అందులో రాష్ట్రంలోని జిల్లాల వారీగా పరిస్థితి గమనిస్తే ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో గణనీయంగా తగ్గింది.
kumaram bheem district

నేషనల్‌ మల్టీ డైమెన్షనల్‌ పావర్టీ ఇండెక్స్‌.. ఏ ప్రోగ్రెస్‌ రివ్యూ –2023 పేరిట నీతి ఆయోగ్‌ సోమవారం ఈ నివేదిక విడుదల చేసింది.

తగ్గిన పేదరికం:

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లో పేదల జనాభా శాతం పరిస్థితి..
   జిల్లా             2015–16      2019–21      రాష్ట్రంలో స్థానం
కుమురంభీం      ––            16.59శాతం       1
ఆదిలాబాద్    27.12శాతం   14.21శాతం       3
నిర్మల్                ––              7.14శాతం       9
మంచిర్యాల        ––             4.43శాతం       17

☛☛ NITI Aayog ‘National Multidimensional Poverty Index': ఏపీలో త‌గ్గిన పేద‌రికం..

ఈ అంశాల ఆధారంగా..

​​​​​​​విద్య, ఆరోగ్యం, జీవన ప్రమాణాల వంటి అంశాలను పరిగణలోకి తీసుకొని నీతి ఆయోగ్‌ ఈ నివేదికను ప్రకటించింది. ప్రధానంగా జాతీయ బహు ముఖియ పేదరిక సూచి (ఎంపీఐ) లోని 12 అంశాలు పరిగణలోకి తీసుకున్నారు. పోషకాహారం లభించని వారు, కౌమార, పిల్లల మరణాలు, వైద్యం అందని బాలింతలు, పాఠశాలలకు వెళ్లని విద్యార్థులు, వంట చెరుకు దొరకని వారు, మరుగుదొడ్లు లేనివారు, తాగునీటి లభ్యత లేనివారు, విద్యుత్‌ సదుపాయం లేనివారు, సొంత ఇల్లు లేనివారు, కనీస ఆస్తి లేనివారు, బ్యాంక్‌ ఖాతా లేనివారు, పాఠశాల విద్య అందనివారు వంటి అంశాలను 2015–16తో పోల్చుతూ 2019–21లో పరిస్థితులను అంచనా వేస్తూ నివేదిక రూపొందించారు.

☛☛ ​​​​​​​Aarogyasri Digital Cards in Telangana: తెలంగాణలో ఇక ఆరోగ్యశ్రీ డిజిటల్‌ కార్డులు

#Tags