Aarogyasri Digital Cards in Telangana: తెలంగాణలో ఇక ఆరోగ్యశ్రీ డిజిటల్ కార్డులు
Sakshi Education
కొత్త ఆరోగ్యశ్రీ డిజిటల్ కార్డులను రూపొందించి స్థానిక ప్రజాప్రతినిధుల ద్వారా జిల్లాల్లోని లబ్దిదారులకు అందజేయాలని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు.
మంగళవారం ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ కార్యాలయంలో ఆరోగ్యశ్రీ బోర్డు సమావేశం జరిగింది. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ పరిమితి రూ.2లక్షల నుంచి రూ.5లక్షలకు పెంచినందున కొత్త ఆరోగ్యశ్రీ డిజిటల్ కార్డులను రూపొందిస్తున్నామని చెప్పారు. ఆరోగ్యశ్రీ రోగులకు ఫేస్ రికగ్నిషన్(ముఖ గుర్తింపు) సాఫ్ట్‌వేర్ వినియోగానికి ఆరోగ్యశ్రీ ట్రస్ట్ అనుమతించింది. అందుకోసం లబ్దిదారుల ఈ–కేవైసీ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. నిమ్స్ స్పెషలిస్టు డాక్టర్ల ద్వారా ఆరోగ్యశ్రీ కేసుల మెడికల్ ఆడిట్ నిర్వహించాలని సూచించారు.
☛☛ Election Commission: హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారిగా జీహెచ్ఎంసీ కమిషనర్
Published date : 19 Jul 2023 01:55PM