Election Commission: హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారిగా జీహెచ్ఎంసీ కమిషనర్
Sakshi Education
తెలంగాణలో రానున్న ఎన్నికల దృష్ట్యా జిల్లాల ఎన్నికల అధికారులు, ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులను కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) నియమించింది. ఈ మేరకు అధికారులను నియమిస్తూ ఈసీ నోటిఫికేషన్ జారీ చేసింది.
కేంద్రం జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారిగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) కమిషనర్ వ్యవహరించనున్నారు. మిగిలిన 32 జిల్లాలకు ఎన్నికల అధికారులుగా ఆయా జిల్లాల కలెక్టర్లు వ్యవహరించనున్నారు. అదనపు కలెక్టర్లు, ఆర్డీఓలు, ఐటీడీఏ పీఓలు, జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్లు, మున్సిపల్ కమిషనర్లు, డిప్యూటీ కలెక్టర్లు.. వీరంతా ఈఆర్వోలుగా వ్యవహరించనున్నట్లు ఈసీ ఉత్తర్వుల్లో పేర్కొంది.
Published date : 18 Jul 2023 08:35PM