Skip to main content

Current Affairs: మార్చి 20వ తేదీ.. టాప్ కరెంట్ అఫైర్స్ ఇవే!

UPSC సివిల్స్, APPSC, TSPSC గ్రూప్స్‌, RRB, బ్యాంక్‌, SSC వంటి అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడే మార్చి 20, 2024 నాటి టాప్ కరెంట్ అఫైర్స్ ఇవే.
Daily Current Affairs 20 March 2024     national gk for competitive exams, competitive exams current affairs

ఆర్థిక వ్యవస్థ:
స్టార్టప్ మహాకుంభ్: ప్రధాని మోదీ భారతదేశం యొక్క శక్తివంతమైన స్టార్టప్ దృశ్యాన్ని ప్రదర్శించే ఈవెంట్‌ను ప్రారంభించారు. 45% పైగా భారతీయ స్టార్టప్‌లు మహిళలచే నాయకత్వం వహిస్తున్నాయి.

ICAR మరియు ధనుకా అగ్రిటెక్ భాగస్వామ్యం: రైతులకు కొత్త సాంకేతిక పరిజ్ఞానాలను అందించడానికి ఒక ఒప్పందంపై సంతకం చేశాయి, చిన్న భూములు మరియు వాతావరణ అనుకూల పద్ధతులపై దృష్టి పెట్టాయి.

జాతీయ అంశాలు:
నేషనల్ కమిటీ ఆఫ్ ఆర్కైవిస్ట్స్ (NCA) 47వ సమావేశం: శ్రీనగర్‌లో ముగిసింది. ఈ సమావేశం వివిధ భారతీయ రాష్ట్రాల నుండి ఆర్కైవిస్ట్‌లను ఒకచోట చేర్చింది.

సైన్స్ & టెక్నాలజీ:
భాషానెట్ పోర్టల్ ప్రారంభం: NIXI యూనివర్సల్ యాక్సెప్టెన్స్ (UA) దినోత్సవాన్ని జరుపుకోవడానికి ఈ పోర్టల్‌ను ప్రారంభించింది.

గ్లోబల్ హైడ్రోజన్ నాయకుల సమావేశం: ఢిల్లీలో జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్నవారు ఆర్థిక వ్యవస్థలను డీకార్బనైజ్ చేయడానికి గ్రీన్ హైడ్రోజన్‌ను ఎలా ఉపయోగించవచ్చో చర్చించారు.

అంతర్జాతీయ అంశాలు:
ప్రపంచంలోనే అత్యంత సంతోషకరమైన దేశాల్లో ఫిన్లాండ్‌ మరోసారి తొలి స్థానంలో నిలిచింది. ఏడు సార్లుగా అదే స్థానంలో నిలవడం విశేషం. అంతర్జాతీయ సంతోష దినోత్సవమైన బుధవారం (మార్చి 20)న యూఎన్‌ ఆధారిత వరల్డ్‌ హ్యాపీనెస్ ఇండెక్స్‌ సంస్థ తాజాగా ఈ ర్యాంకులను విడుదల చేసింది. సంతోష సూచీల్లో నార్డిక్‌ దేశాలైన ఫిన్లాండ్‌(1), డెన్మార్క్‌(2), ఐస్‌లాండ్‌(3) వరుసగా తొలి మూడు ర్యాంకుల్లో నిలిచాయి.

ఈ జాబితాలో భారత్‌ 126వ స్థానంలో నిలిచింది. గత ఏడాదితో పోలిస్తే ఒకస్థానం కిందకు దిగజారడం గమనార్హం. ఇక చైనా (60), నేపాల్‌ (95), పాకిస్థాన్‌ (108), మయన్మార్‌(118) ఉన్నాయి. 

ఇక ఈ నివేదికను ఆత్మ సంతృప్తి, తలసరి జీడీపీ, సామాజిక మద్దతు, జీవన కాలం, స్వేచ్ఛ, దాతృత్వం, అవినీతి వంటి అంశాల ఆధారంగా ఈ జాబితాను రూపొందిస్తారు. 

వ్యక్తులు:
విదేశీ వ్యవహరాల్లో నిపుణుడైన ఇండియన్‌ ఫారెన్‌ సర్వీస్‌ (ఐఎఫ్‌ఎస్‌) అధికారి వినయ్‌కుమార్‌ను రష్యా రాయబారిగా కేంద్ర ప్రభుత్వం నియమించింది. 1992 బ్యాచ్‌ ఐఎఫ్‌ఎస్‌ అధికారి అయిన వినయ్‌కుమార్‌ 2021 నుంచి మయన్మార్‌లో భారత రాయబారిగా విధులు నిర్వహించారు. ప్రస్తుతం రష్యా రాయబారిగా పనిచేస్తున్న పవన్‌కుమార్‌ ఇటీవలే విదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శిగా నియమితులయ్యారు.

Today Current Affairs: మార్చి 19-2024 ముఖ్యమైన వార్తలు

Published date : 21 Mar 2024 11:49AM

Photo Stories