Solar Power Plant: తెలంగాణ పొలాల్లో సోలార్‌ ప్లాంట్లు.. పీఎం–కుసుం పథకం కింద కేంద్రం గ్రీన్‌సిగ్నల్

ప్రధానమంత్రి కిసాన్‌ ఊర్జా సురక్షా ఏవం ఉత్థాన్‌ మహాభియాన్‌ (పీఎం–కుసుమ్‌) పథకం కింద రైతులు/రైతు సంఘాల ఆధ్వర్యంలో తెలంగాణ‌ రాష్ట్రంలో 4 వేల మెగావాట్ల సౌర విద్యుత్‌ ప్లాంట్ల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఇటీవల అనుమతిచ్చింది.

అన్ని రాష్ట్రాలకు కలిపి ఇప్పటివరకు 8,112 మెగావాట్ల సౌర విద్యుత్‌ ప్లాంట్ల స్థాపనకు కేంద్రం అనుమతి ఇవ్వగా, అందులో అత్యధికంగా 4 వేల మెగావాట్ల ప్లాంట్లు రాష్ట్రానికి సంబంధించినవే. రైతులు వ్యక్తిగ తంగా లేదా ఇతరులతో కలిసి తమ పొలాల్లో 0.5 మెగా వాట్లు నుంచి 2 మెగావాట్ల సామర్థ్యం కలిగిన చిన్న సోలార్‌ పవర్‌ ప్లాంట్లను పెట్టుకోవడానికి అవకాశం కల్పిస్తారు. 

ఆర్పీవో నిబంధనల ప్రకారం..
రెన్యువబుల్‌ పర్చేజ్‌ ఆబ్లిగేషన్‌ (ఆర్పీవో) నిబంధనల ప్రకారం రాష్ట్ర విద్యుత్‌ పంపిణీ సంస్థ (డిస్కం)లు ఏటా తప్పనిసరిగా కొంత శాతం పునరుత్పాదక విద్యుత్‌ను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. దీంతో ఈ ప్లాంట్‌ల ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్‌ను కూడా ఆర్పీఓ నిబంధనల కింద డిస్కంలు తప్పనిసరిగా రైతుల నుంచి కొనుగోలు చేయాల్సి ఉంటుంది. 
యూనిట్‌ విద్యుత్‌కు రూ.3.13 చొప్పున రైతులకు డిస్కంలు చెల్లించనున్నాయి. రైతుల నుంచి కొనుగోలు చేసే ప్రతి యూనిట్‌ విద్యుత్‌కు 0.40 పైసలు చొప్పున ఐదేళ్ల పాటు డిస్కంలకు కేంద్ర పునరు త్పాదక ఇంధన శాఖ ప్రోత్సాహకంగా అందించనుంది.

Smart Cities: దేశంలో 12 గ్రీన్‌ఫీల్డ్‌ ఇండస్ట్రియల్‌ స్మార్ట్‌ సిటీలకు గ్రీన్‌సిగ్నల్‌.. ఏపీలోని రెండు జిల్లాల్లో..

త్వరలో ఆసక్తి వ్యక్తీకరణకు ఆహ్వానం..
డిస్కంలు తమ 33/11 కేవీ, 66/11 కేవీ, 110/11 కేవీ సబ్‌ స్టేషన్ల వారీగా వాటి పరిధిలో ఎంత సామర్థ్యం మేరకు సోలార్‌ పవర్‌ ప్లాంట్లు పెట్టేందుకు అవకాశం ఉందో గుర్తించి తమ వెబ్‌సైట్‌లో ప్రకటించాల్సి ఉంటుంది. ఇప్పటికే రాష్ట్రంలో ఈ ప్రక్రియ పూర్తైంది. త్వరలో  రైతుల నుంచి ఆసక్తి వ్యక్తీకరణను ఆహ్వానిస్తూ డిస్కంలు ప్రకటన జారీ చేయనున్నాయి. 

ఆసక్తి గల రైతులు/డెవలపర్లు మెగావాట్‌కు రూ.5000కి మించకుండా ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోవాలి. రైతులు/డెవలపర్లు కుదుర్చుకునే విద్యుత్‌ కొనుగోలు ఒప్పందం ఆధారంగా రైతులు/డెవలపర్లకు బ్యాంకులు రుణం ఇవ్వనున్నాయి. 

Varieties Developed: నూత‌న వంగడాలు.. జన్యుపరమైన లోపాలకు దూరంగా..

#Tags