AP Government: ఏపీలో 12 ప్రాజెక్టుల పేర్లు మార్పు.. ప్ర‌స్తుత పేర్లు ఇవే..

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో 12 సాగునీటి ప్రాజెక్టుల పేర్ల‌ను రాష్ట్ర ప్ర‌భుత్వం మార్చింది.

గోదావ‌రి, కృష్ణా జ‌లాల‌తో ప‌ల్నాడును సుభిక్షం చేయ‌డానికి గ‌త ప్రభుత్వం వైఎస్సార్ ప‌ల్నాడు క‌రువు నివార‌ణ ప‌థ‌కం (వైఎస్సార్‌పీడీఎంపీ) కింద గోదావ‌రి-పెన్నా అనుసంధానం తొలి ద‌శ‌, వ‌రిక‌పుడిశెల ఎత్తిపోత‌ల‌ను చెప‌ట్టింది. 
ఇప్పుడు వైఎస్సార్ ప‌ల్నాడు క‌ర‌వు నివార‌ణ ప‌థ‌కం పేరును ర‌ద్దు చేసి.. గోదావ‌రి-పెన్నా అనుసంధానం తొలిద‌శ‌, వ‌రిక‌పుడిశెల ఎత్తిపోత‌లుగా ఆ ప్రాజెక్టు పేరును మార్పు చేసింది. 

➣ వైఎస్సార్ వేదాద్రి ఎత్తిపోత - ముక్త్యాల ఎత్తిపోత‌లు
➣ వైఎస్సార్ వెలిగ‌ల్లు బ్చాలెన్సింగ్ రిజ‌ర్వాయ‌ర్ - స‌ర్వారాయ‌ సాగ‌ర్ 
➣ న‌ల్ల‌పురెడ్డి శ్రీనివాసులు రెడ్డి నెల్లూరు బ్యారేజీ - నెల్లూరు బ్యారేజీ
➣ వేక‌పాటి గౌతంరెడ్డి సంగం బ్యారేజీ - సంగం బ్యారేజీ
➣ గొర్రిపాటి బుబ్చిఅప్పారావు తాటిపూడి రిజ‌ర్వాయ‌ర్ - తాటిపూడి రిజ‌ర్వాయ‌ర్  
➣ అనంత వెంక‌ట‌రెడ్డి హంద్రీ-నీవా సుజ‌ల స్ర‌వంతి - హంద్రీ-నివా సుజ‌ల స్ర‌వంతి
➣ వైఎస్సార్ అప్ప‌ర్ పెన్నార్ ప్రాజెక్టు - ప‌రిటాల ర‌వీంద్ర ఎత్తిపోత‌ల ప‌థ‌కం
➣ బూచేప‌ల్లి సుబ్బారెడ్డి మొగ‌లి గుండాల మినీ రిజ‌ర్వాయ‌ర్ - మొగ‌లి గుండాల మినీ రిజ‌ర్వాయ‌ర్‌
➣ రెకెట్ల నారాయ‌ణ‌రెడ్డి ఎత్తిపోత‌  - రాకెట్ల ఆమిద్యాల ఎత్తిపోత‌ 

National Highways: ఏపీలో జాతీయ రహదారుల నిర్మాణానికి రూ.7,266 కోట్లు

#Tags