Visakhapatnam Port: విశాఖపట్నం పోర్టుకు మరో రికార్డు
Sakshi Education
మేజర్ పోర్టులతో పోటీపడుతూ నంబర్ వన్ దిశగా అడుగులు వేస్తున్న విశాఖపట్నం పోర్టు అథారిటీ(వీపీఏ) క్రూడ్ ఆయిల్ హ్యాండ్లింగ్‌లో తన రికార్డుని తానే అధిగమించింది.
హిందూస్థాన్ పెట్రోలియం కార్పిరేషన్ లిమిటెడ్(హెచ్‌పీసీఎల్)కు చెందిన ముడిచమురు నిర్వహణలో అద్భుత ఫలితాలు రాజట్టింది. మలేషియాకు చెందిన ఎంటీ ఈగల్ వ్యాలరీ క్రూడాయిల్ షిప్ ఆగస్టు 1వ తేదీన విశాఖ పోర్టుకు చేరుకుంది.
24 గంటల సాటు విశాఖ తీరం సమీపంలోని వీపీఏ పాయింట్ మూరింగ్ ఎస్‌పీఎం వద్ద హెచ్‌పీసీఎల్‌కు చెందిన 1,60,000 మెట్రిక్ టన్నుల క్రూడాయిల్ హ్యాండ్లింగ్ చేశారు. దీంతో పోర్టు చరిత్రలోనే అత్యధికంగా ముడిచమురు నిర్వహించింది. ఈ ఏడాది మే 26వ తేదీ హ్యాండ్లింగ్ చేసిన 1.50 లక్షల మెట్రిక్ టన్నుల రికార్డును పోర్టు అధిగమించిందని వీపీఏ చైర్మన్ డా.అంగముత్తు తెలిపారు.
Heavy Water Plant: దేశంలోనే ఉత్పత్తి, ఎగుమతుల్లో ముందంజలో ఉన్న వాటర్ ప్లాంట్ ఇదే..
Published date : 05 Aug 2024 09:52AM