Ambati Rayudu meets YS Jagan: సీఎం వైఎస్‌ జగన్‌ను కలిసిన అంబటి​ రాయుడు

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిని టీమిండియా మాజీ క్రికెటర్‌ అంబటి తిరుపతి రాయుడు తాడేపల్లిలోని సీఎం నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసారు.
Ambati Rayudu meets YS Jagan

అంబటి రాయుడితో పాటు సీఎస్‌కే ఫ్రాంచైజీ ఓనర్‌ ఎన్‌.శ్రీనివాసన్‌ కుమార్తె రూపా గురునాథ్ కూడా సీఎం జగన్‌ను కలిశారు. ఈ సందర్భంగా రాయుడు ఇటీవల తమ జట్టు గెలిచిన ఐపీఎల్‌ 2023 ట్రోఫీని సీఎంకు చూపించారు.

Top 10 medical colleges: టాప్ టెన్ మెడిక‌ల్ కాలేజీలు ఇవే... ఇక్క‌డ సీటు వ‌స్తే సెటిలైన‌ట్లే..!

ఈ సందర్భంగా ఏపీలో క్రీడారంగం అభివృద్ది, మౌలిక సదుపాయాల కల్పన ద్వారా క్రీడలను ప్రోత్సహించడానికి తాను ఆసక్తిగా ఉన్నట్లు సీఎం జగన్‌కు అంబటి రాయుడు వివరించారు. వారి సూచనల మేరకు పటిష్టమైన కార్యక్రమాన్ని ప్రభుత్వం రూపొందిస్తుందని సీఎం జగన్‌ హామీ ఇచ్చారు.

ఐపీఎల్‌లో అంబటి రాయుడు ప్రాతినిధ్యం వహించిన సీఎస్‌కే ఫైనల్లో గుజరాత్‌ టైటాన్స్‌ను మట్టికరిపించి, ఐదో సారి విజేతగా నిలిచింది. ఫైనల్‌ మ్యాచ్‌కు ముందు రాయుడు ఐపీఎల్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించాడు. ఫైనల్‌ మ్యాచ్‌ ఆడి రాయుడు ఐపీఎల్‌ కెరీర్‌కు ముగింపు పలికాడు. 

విదేశాల్లో ఎంబీబీఎస్ చేయాల‌నుకుంటున్నారా... అయితే వీటి గురించి తెలుసుకుని వెళ్లండి...!

కాగా, రాయుడు.. సీఎం జగన్‌ కలవడం ఇటీవలికాలంలో ఇది రెండోసారి. ఐపీఎల్‌ ఫైనల్‌కు ముందు కూడా రాయుడు ఓసారి సీఎంను కలిశారు. ఆ సందర్భంగా రాష్ట్రంలో క్రీడల అభివృద్ధి, క్రీడారంగంలో యువతకు అవకాశాలు, శిక్షణ తదితర అంశాలపై రాయుడు సీఎం జగన్‌తో చర్చించారు.

#Tags