Tomiko Itooka: ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలు కన్నుమూత

ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలైన 116 ఏళ్ల టొమికో ఇటుకా ఇకలేరు.

జపాన్‌కు చెందిన ఈమె డిసెంబర్ 29వ తేదీ మృతి చెందినట్లు అక్కడి అధికారులు వెల్లడించారు. గిన్నిస్‌ రికార్డు ప్రకారం.. గత ఏడాది అత్యంత వృద్ధురాలిగా ఉన్న స్పెయిన్‌కు చెందిన మరియా బ్రాన్యాస్‌ మొరెరా (117) కన్నుమూయడంతో ఇటుకాకు రికార్డు దక్కింది. 

టొమికో ఇటుకా.. 1908, మే 23వ తేదీ ఒసాకాలో జ‌న్మించింది. అదే ఏడాది రైట్‌ బ్రదర్స్‌ ఐరోపా, అమెరికాల్లో తొలిసారిగా విమానాలను ప్రారంభించారు. ఈఫిల్‌ టవర్‌ నుంచి తొలి సుదూర రేడియో సందేశం పంపించారు. ఇటుకా జపాన్‌లోని నగరమైన అషియా నివాసి.
 
ఆమె 70వ ఏట జపాన్‌లోని 3,067 మీటర్ల ఎత్తయిన ఒంటాకే పర్వతాన్ని రెండుసార్లు అధిరోహించారు. అది కూడా బూట్లు ధరించకుండా స్నీకర్స్‌తో ఎక్కి గైడ్‌నే ఆశ్చర్యపరిచారు. 100 ఏళ్ల వయసులో ఆషియా మందిరంలోని అతి పొడవైన రాతి మెట్లెక్కారు. 20 సంవ‌త్స‌రాల వ‌య‌సులో వివాహం చేసుకున్న ఈమెకు ఇద్దరు కొడుకులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

Rajagopala Chidambaram: అణుశాస్త్రవేత్త రాజగోపాల చిదంబరం కన్నుమూత

ప్రపంచంలో అత్యంత ఎక్కువ కాలం బతికిన వ్యక్తి ఫ్రెంచ్‌ మహిళ జీన్‌ లూయిస్‌ కాల్మెంట్‌. ఆమె 122 ఏళ్ల 164 రోజులు జీవించి 1997లో మరణించారు.

#Tags