Singapore PM: సింగపూర్‌ ప్రధాని పదవిని వీడనున్న లీ సీన్‌ లూంగ్

సింగపూర్‌ ప్రధానమంత్రిగా దాదాపు రెండు దశాబ్దాలపాటు కొనసాగిన లీ సీయన్‌ లూంగ్‌(72) రిటైర్మెంట్‌ ప్రకటించారు.

మే 15వ తేదీన బాధ్యతల నుంచి వైదొలగనున్నట్లు ఏప్రిల్ 15వ తేదీ సామాజిక మాధ్యమంలో లూంగ్ తెలిపారు. అదే రోజూన ఉప ప్రధానమంత్రి లారెన్స్‌ వాంగ్‌(51) ప్రధానిగా బాధ్యతలు చేపడతారన్నారు.

సింగపూర్‌ మూడో ప్రధానిగా 2004లో లూంగ్‌ బాధ్యతలు చేపట్టారు. ఏ దేశానికైనా నాయకత్వ మార్పిడి ఎంతో ముఖ్యమైన విషయమని ఆయన ఫేస్‌బుక్‌లో పేర్కొన్నారు. సింగపూర్‌కు మరింత ఉజ్వల భవిష్యత్తును అందించేందుకు వాంగ్‌ ప్రభుత్వానికి సహకారం అందించాల్సిందిగా ప్రజలను ఆయన కోరారు.

Simon Harris: ఐర్లాండ్ ప్రధానిగా నియమితులైన అత్యంత పిన్న వయస్కుడు.. ఈయ‌నే..

#Tags