Shaktikanta Das: ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాంకర్‌గా ఆర్‌బీఐ గ‌వ‌ర్న‌ర్‌

ప్రపంచంలోని సెంట్రల్‌ బ్యాంకు గవర్నర్లలో భారతీయ రిజర్వ్‌ బ్యాంకు గవర్నర్‌ శక్తికాంత దాస్‌ అత్యుత్తమ బ్యాంకర్‌గా నిలిచారు.

అంతర్జాతీయ స్థాయిలో దాస్‌ ఈ గుర్తింపు పొందడం ఇది వరుసగా రెండోసారి. అమెరికాకు చెందిన గ్లోబల్‌ ఫైనాన్స్‌ మ్యాగజీన్‌ తాజాగా సెంట్రల్‌ బ్యాంక్‌ గవర్నర్లకు ర్యాంకులు ప్రకటించింది.
 
ఈ ర్యాంకుల్లో ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ మరోసారి అగ్రస్థానంలో నిలిచారు. ‘గ్లోబల్‌ ఫైనాన్స్‌ సెంట్రల్‌ బ్యాంకర్‌ రిపోర్ట్‌ కార్డ్స్‌ 2024’లో దాస్‌కు ‘ఏ+’ రేటింగ్‌ లభించింది. గ్లోబర్‌ ర్యాంకుల్లో భాగంగా ద్రవ్యోల్బణ కట్టడి, ఆర్థికాభివృద్ధి లక్ష్యాలు, కరెన్సీ స్థిరత్వం, వడ్డీ రేట్ల నిర్వహణ ఆధారంగా ‘ఏ’ నుంచి ‘ఎఫ్‌’ వరకు గ్రేడ్‌లను కేటాయిస్తారు. 

అద్భుతమైన పనితీరు కనబరిస్తే ‘ఏ+’ ర్యాంకు ఇస్తారు. అధ్వాన పనితీరుకు ‘ఎఫ్‌’ రేటింగ్‌ కేటాయిస్తారు. శక్తికాంత దాస్‌తో పాటు డెన్మార్క్‌ సెంట్రల్‌ బ్యాంక్‌ గవర్నర్‌ క్రిస్టియన్‌ కెట్టల్, థాసన్, స్విట్జర్లాండ్‌(స్విస్‌ సెంట్రల్‌ బ్యాంక్‌)గవర్నర్‌ థామస్‌ జె.జోర్డాన్‌లకు ‘ఏ+’ రేటింగ్‌ దక్కింది.

Nalin Prabhat: జమ్మూకశ్మీర్‌ డీజీపీగా.. ఏపీ కేడర్‌ ఐపీఎస్‌ నలిన్‌ ప్రభాత్

#Tags