CAG of India: కంప్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్‌గా సంజయ్ మూర్తి

కంస్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్)గా తెలుగు అధికారి కొండ్రు సంజయ్ మూర్తి న‌వంబ‌ర్ 21వ తేదీ ప్రమాణ స్వీకారం చేశారు.

రాష్ట్రపతి భవన్‌లోని గణతంత్ర మండపంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. 
ప్రమాణ స్వీకారం తర్వాత సంజ యమూర్తి సంబంధింత పత్రాలపై సంతకం చేసి బాధ్యతలు స్వీకరించారు. 'కాగ్'గా బాధ్యతలు చేపట్టిన తొలి తెలుగు అధికారిగా సంజయ్ మూర్తి రికార్డుకెక్కారు. 

ఆంధ్రప్రదేశ్‌లో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు చెందిన సంజయ్ మూర్తి 1964 డిసెంబర్ 24వ తేదీ జన్మించారు. మెకానికల్ ఇంజనీరింగ్ చదివారు. 1989 బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్గా హిమాచల్ ప్రదేశ్ కేడర్‌కు ఎంపికయ్యారు. తొలుత ఎక్కువ కాలం హిమాచల్ ప్రదేశ్‌లో, ఆ తర్వాత కేంద్ర సర్వీసుల్లో సేవలందించారు. 2021 సెప్టెంబర్లో జాతీయ ఉన్నత విద్యా మండలి కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. ఐఏఎస్ అధికారిగా మరో నెల రోజుల్లో ఆయన పదవీ విరమణ చేయాల్సి ఉంది.

సంజయ్ మూర్తి ప్రతిభను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ఆయనను ప్రతిష్టాత్మక కంప్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ పదవిలో నియమించింది. ఈ పదవిలో నియమితులైన అధికారులు గరిష్టంగా ఆరేళ్ల వరకూ లేదా 65 ఏళ్ల వయసు వచ్చేదాకా పనిచేయవచ్చు. సంజయ్ మూర్తి తండ్రి కె.ఎస్.ఆర్. మూర్తి గతంలో అమలాపురం ఎంపీగా పనిచేశారు.

Miss Universe 2024: 'విశ్వ సుందరి'గా డెన్మార్క్‌ బ్యూటీ.. ఆమె ఎవ‌రో తెలుసా..?

#Tags