Israel Hezbollah War: క్షిపణి దాడుల్లో హెజ్‌బొల్లా అగ్రనేత మృతి
సెప్టెంబర్ 28వ తేదీ ఇజ్రాయెల్ సైన్యం దాడిలో సంస్థ సెంట్రల్ కౌన్సిల్ డిప్యూటీ హెడ్ నబీల్ కౌక్ మరణించారు. ఈ విషయాన్ని ఇజ్రాయెల్ సైన్యం సెప్టెంబర్ 29వ తేదీ వెల్లడించింది. కౌక్ మృతిని హెజ్‌బొల్లా ధ్రువీకరించింది. దీంతో గత వారం రోజుల్లో ఇజ్రాయెల్ దాడుల్లో హతమైన హెజ్‌బొల్లా ముఖ్యుల సంఖ్య ఏడుకు పెరిగింది.
హెచ్‌బొల్లా చీఫ్ హసన్ నస్రల్లా సెప్టెంబర్ 27వ తేదీ ఇజ్రాయెల్ భీకర బాంబు దాడిలో మృతి చెందారు. ఆయనతో పాటు ఇద్దరు అగ్రశ్రేణి కమాండర్లు కూడా మరణించారు. దాంతో హెజ్‌బొల్లా పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.
కౌక్ 1980ల నుంచి హెజ్‌బొల్లాలో చురుగ్గా పని చేస్తూ అగ్ర నేతగా ఎదిగారు. 2006లో దక్షిణ లెబనాన్‌లో ఇజ్రాయెల్‌తో జరిగిన యుద్ధంలో హెజ్‌బొల్లా మిలటరీ కమాండర్‌గా పనిచేశారు. మీడియాలో తరచుగా కనిపిస్తూ రాజకీయ, భద్రతాపరమైన అంశాలపై అభిప్రాయాలు వెల్లడించేవారు. హెజ్‌బొల్లా చీఫ్‌గా నస్రల్లా బంధువు హషీం సైఫుద్దీన్ దాదాపుగా ఖరారైనట్టు సమాచారం.
Sri Lankan President: శ్రీలంక నూతన అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసింది ఈయనే..
జోర్డాన్‌పై మిస్సైల్ దాడి!
మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు నానాటికీ పెరిగిపోతున్నాయి. జోర్డాన్‌పైనా క్షిపణి దాడి జరిగింది. భారీ క్షిపణి ఒకటి బహిరంగ ప్రదేశంలో పడిపోయినట్లు జోర్డాన్ సైన్యం వెల్లడించింది. ఇది లెబనాన్ నుంచి దూసుకొచ్చినట్లు తెలిపింది. ఈ ఘటనలో ఎలాంటి నష్టం వాటిల్లలేదని ప్రకటించింది. మధ్య ప్రాచ్యంలో పెరుగుతున్న ఉద్రిక్తతలపై ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫతా ఎల్–సిసీ ఆందోళన వ్యక్తంచేశారు.
ఇరాన్ గూఢచారి ఇచ్చిన పక్కా సమాచారంతోనే...!
లెబనాన్ రాజధాని బీరుట్‌లో ఓ భవనం కింద భారీ నేలమాళిగలో దాక్కున్న హెజ్‌బొల్లా చీఫ్ హసన్ నస్రల్లాను ఇజ్రాయెల్ సైన్యం మట్టుబెట్టింది. ఇరాన్ గూఢచారి ఇచ్చిన కచ్చితమైన సమాచారంతోనే నస్రల్లా జాడను గుర్తించినట్లు ఫ్రెంచ్ పత్రిక లీ పారిసీన్ వెల్లడించింది. అండర్‌గ్రౌండ్‌లో హెజ్‌బొల్లా సీనియర్ సభ్యులతో నస్రల్లా సమావేశం కాబోతున్నట్లు సదరు గూఢచారి ఇజ్రాయెల్‌కు ఉప్పందించాడని తెలిపింది.
స్రల్లా మృతిపై ఇరాన్‌లో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఆదివారం జనం వేలాది మంది వీధుల్లోకి వచ్చారు. అమెరికాకు, ఇజ్రాయెల్‌కు చావు తప్పదంటూ నినాదాలు చేశారు. పార్లమెంట్ సభ్యులు కూడా నిరసనల్లో పాల్గొన్నారు. 1980వ దశకం నుంచి హెజ్‌బొల్లాకు ఇరాన్ అండగా నిలుస్తున్నారు.
Sri Lanka New PM: శ్రీలంక నూతన ప్రధానిగా హరిణి అమరసూర్య.. ఈమె డిగ్రీ చదివింది ఢిల్లీలోనే..