Skip to main content

National Lok Adalat: ఒకేరోజు 12,39,044 కేసుల పరిష్కారం.. దేశంలోనే 'టీజీఎస్ ఎల్‌ఎస్‌ఏ' నంబర్‌వన్

దేశవ్యాప్తంగా నిర్వహించిన మూడో జాతీయ లోక్‌ అదాలత్‌లో అత్యధిక కేసులు పరిష్కరించి తెలంగాణ రాష్ట్ర లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ (టీజీఎస్‌ ఎల్‌ఎస్‌ఏ) నంబర్‌ వన్‌గా నిలిచింది.
Telangana Tops country in disposal of cases at 3rd National Lok Adalat

ఒకే రోజు 12,39,044 కేసులను పరిష్కరించి ఈ ర్యాంక్‌ సాధించింది. ఈ నేపథ్యంలో అథారిటీని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అలోక్‌ అరాధే, జస్టిస్‌ సుజోయ్‌పాల్‌ అభినందించారు. భవిష్యత్‌లో మరిన్ని కేసులను పరిష్కరించి, కక్షిదారులకు సత్వర న్యాయం అందించాలని అభిలషించారు. 

ప్రత్యామ్నాయ పరిష్కార వేదికగా ఎదుగుతున్న అథారిటీకి ప్రజాదరణ పెరుగు తుండటంపై హర్షం వ్యక్తం చేశారు. కోర్టులపై భారం తగ్గడంతోపాటు వేగంగా న్యాయం అందిస్తున్న అథారిటీ మరింత వృద్ధి సాధించాలని అభిప్రాయ పడ్డారు. 

Gender Equality: లింగ సమానత్వంలో భారత్‌ ఎదుర్కొంటున్న సవాళ్లు, అవకాశాలు ఇవే..

ఈ సందర్భంగా హైకోర్టు ఆవరణలోని లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ కార్యాలయంలో సభ్యకార్యదర్శి సీహెచ్‌ పంచాక్షరి అక్టోబ‌ర్ 28వ తేదీ మాట్లాడారు. 2024 సెప్టెంబర్‌ 14న నిర్వహించిన లోక్‌ అదాలత్‌లో 12,39,044 కేసులను పరిష్కరించి రూ.250,19,44,447 పరిహారం కక్షిదారులకు అందజేశామని చెప్పారు. 

కేసుల సత్వర పరిష్కారం, ఖర్చు లేకుండా న్యాయం అందించడమే లక్ష్యంగా అథారిటీ పనిచేస్తుందన్నారు. అథారిటీ ప్యా ట్రన్‌ ఇన్‌ చీఫ్, హైకోర్టు సీజే జస్టిస్‌ అలోక్‌ అరాధే, అథారిటీ ఎగ్జి క్యూటివ్‌ చైర్మన్, జస్టిస్‌ సుజోయ్‌ పాల్‌ నేతృత్వం, సూచనలతో పెద్ద మొత్తంలో కేసుల పరిష్కారం సాధ్యౖమెందని వెల్లడించారు.  

Cybercrime: సైబర్‌ క్రైమ్‌.. ఫేస్‌బుక్‌, వాట్సాప్ వాడుతున్నారా.. అయితే జ‌ర జాగ్ర‌త్త‌!!

Published date : 29 Oct 2024 12:02PM

Photo Stories