Chief Information Commissioner: కేంద్ర సమాచార కమిషన్‌ ప్రధాన కమిషనర్‌గా హీరాలాల్‌ సమారియా

కేంద్ర సమాచార కమిషన్‌ (సెంట్రల్‌ చీఫ్‌ ఇన్ఫర్మేషన్‌ కమిషన్‌) ప్రధాన కమిషనర్‌గా హీరాలాల్‌ సమారియా బాధ్యతలు స్వీకరించారు.

 సోమవారం రాష్ట్రపతి భవన్‌లో ద్రౌపదీ ముర్ము సమక్షంలో హీరాలాల్‌ ప్రమాణ స్వీకారం చేశారు. వైకే సిన్హా పదవీ కాలం అక్టోబర్‌ 3న ముగియడంతో.. సమాచార కమిషన్‌ నియామకాలను చేపట్టాలంటూ కేంద్రానికి ఇటీవల సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

Italy new ambassador: ఇటలీలో భారత రాయబారిగా వాణి సర్రాజురావు

ఈ నేపథ్యంలో రాజస్తాన్‌కు చెందిన హీరాలాల్‌ సమారియాను సీఐసీ చీఫ్‌ కమిషనర్‌గా రెండేళ్ల కాలానికి గాను కేంద్రం నియమించింది. ఈ పదవిని దళిత వర్గానికి చెందిన అధికారి చేపట్టడం ఇదే మొదటిసారి. 1985వ బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారి హీరాలాల్‌ సమారియా గతంలో కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ కార్యదర్శిగా ఉన్నారు.

BHEL appoints Murthy as Next CMD: బీహెచ్‌ఈఎల్‌ సీఎండీగా కొప్పు సదాశివ మూర్తి

#Tags