Finance Commission Members: 16వ ఆర్థిక సంఘం సభ్యుల నియామకం.. వారు ఎవ‌రంటే..

కేంద్ర ప్రభుత్వం ఇటీవ‌ల‌ ఏర్పాటైన 16వ ఆర్థిక సంఘంలో నలుగురు సభ్యులను నియమించింది.

ఈ ఫైనాన్స్‌ కమిషన్ నీతి ఆయోగ్‌ మాజీ వైస్‌ చైర్మన్‌ అర్వింద్‌ పనగరియా నేతృత్వంలో వచ్చింది. ఇందులో సభ్యులుగా మాజీ వ్యయ కార్యదర్శి అజయ్‌ నారాయణ్‌ ఝా, ఎస్బీఐ గ్రూప్‌ చీఫ్‌ ఎకనామిక్‌ అడ్వైజర్‌ సౌమ్య కాంతి ఘోష్‌, రిటైర్డ్‌ బ్యూరోక్రాట్‌ అన్నీ జార్జ్‌ మాథ్యూ, అర్థ గ్లోబల్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ నిరంజన్‌ రాజాధ్యక్షలను ఎంపిక చేసింది.

ఇందులో అజయ్‌ నారాయణ్‌ ఝా 15వ ఆర్థిక సంఘంలోనూ సభ్యుడిగా ఉన్నారు. కాగా అజయ్‌, జార్జ్‌, నిరంజన్‌లు కమిషన్‌లో పూర్తిస్థాయి సభ్యులుగా ఉండనుండగా, సౌమ్య మాత్రం పార్ట్ టైమ్ సభ్యుడిగా ఉంటారని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. 2023 డిసెంబర్‌ 31న ఏర్పాటైన ఈ కమిషన్ 2025 అక్టోబర్ 31వ తేదీ కంతా తమ రిపోర్టును సమర్పించాల్సి ఉంది. 

Forbes Billionaires 2023: ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడిగా బెర్నార్డ్ ఆర్నాల్ట్.. టాప్‌ 10 కుబేరులు వీరే..

#Tags