Manmohan Singh: 33 ఏళ్ల పార్లమెంట్‌ సభ్యుడిగా కొనసాగిన మన్మోహన్‌ సింగ్‌.. ముగిసిన పదవీకాలం

ఎన్నో ఆర్థిక సంస్కరణలకు బాటలు వేసిన మాజీ ప్రధానమంత్రి మన్మోహన్‌ సింగ్‌ 33 ఏళ్ల పార్లమెంటరీ ప్రస్థానం ఏప్రిల్ 3వ తేదీతో ముగిసింది.

ఈయ‌న‌తో పాటు తొమ్మిది మంది కేంద్రమంత్రులు, 44 మంది ఇతరులు కూడా రాజ్యసభకు వీడ్కోలు పలికారు.  

➤ మన్మోహన్‌ సింగ్ దివంగత ప్రధాన‌మంత్రి పీవీ నర్సింహారావు నేతృత్వంలో ఆర్థిక సంస్కరణలను పట్టాలెక్కించారు. అలాగే పది సంవ‌త్స‌రాలు(2004-2014) ప్రధానమంత్రిగా ప‌నిచేశాడు. 
➤ 1991 అక్టోబర్ 1వ తేదీ అస్సాం నుంచి రాజ్యసభకు ఎన్నికై, 2019 జూన్ 14వ తేదీ వరకు ఎగువ సభలో ఆ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించారు. 
➤ 2019 ఆగస్టు 20వ తేదీ రాజస్థాన్‌ నుంచి తిరిగి రాజ్యసభకు ఎన్నిక‌య్యాడు. 

➤ ఈయ‌న పంజాబ్‌ యూనివర్సిటీలో, దిల్లీ స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌లో అధ్యాపకుడిగా ప‌నిచేశాడు. 
➤ 1971లో కేంద్ర వాణిజ్యశాఖకు ఆర్థిక సలహాదారుగా నియమితులై తొంద‌ర‌లోనే ఆర్థిక మంత్రిత్వ శాఖకు ప్రధాన సలహాదారుడయ్యాడు. 
➤ అలాగే ప్రణాళిక సంఘం డిప్యూటీ ఛైర్మన్‌గా, ఆర్బీఐ గవర్నర్‌గా, ప్రధాన మంత్రికి సలహాదారుగా, యూజీసీ ఛైర్మన్‌గా ప‌నిచేశాడు.

Forbes Richest Billionaires: ప్రపంచ కుబేరుల జాబితాలో మన తెలుగువాళ్లు, వీళ్ల ఆస్తుల లెక్కలు చూస్తే..

#Tags