SBI New Chairman : ఎస్‌బీఐ కొత్త చైర్మన్‌గా చల్లా శ్రీనివాసులు శెట్టి

ఎఫ్‌ఎస్ఐబీ ప్రభుత్వ యాజమాన్యంలోని బ్యాంకులు సహా ఆర్థిక సంస్థల డైరెక్టర్ల కోసం అత్యంత ప్రతిభావంతుల‌ను వెలికి తీస్తుంది. ముఖ్యంగా వారి అనుభవం, పనితీరును బట్టి సరైన వ్యక్తుల్ని సిఫారసు చేస్తుంది. అలా, వారి ఎంపిక ప్ర‌క్రియ‌ చేస్తుంది. ఈ ప‌ద్ధ‌తితోనే ప్రభుత్వ రంగ దిగ్గజం స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ) కొత్త చైర్మన్‌ గా చల్లా శ్రీనివాసులు శెట్టి (సీఎస్‌శెట్టి) నియామకానికి కేంద్రం ఆమోదం తెలిపింది.

PM Modi : అత్యంత ప్రజాదరణ కలిగిన నేతగా మ‌రోసారి అగ్ర‌స్థానంలో మోదీ..

ఇందుకు సంబంధించి ఆర్థిక సేవల విభాగం పంపిన ప్రతిపాదనకు నియామకాల క్యాబినెట్‌ కమిటీ (ఏసీసీ) ఆమోదముద్ర వేసినట్లు అధికారిక ప్రకటనలో వెల్లడైంది. ప్రస్తుతం స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాకు ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్న దినేశ్‌కుమార్‌ ఖారా ఆగస్టు 28వ తేదీ పదవీ విరమణ చేయనున్నారు. అనంతరం ఆయన స్థానంలో శెట్టి బాధ్యతలు స్వీకరిస్తారు. ఆయన పదవీకాలం మూడేళ్లు వ‌ర‌కు ఉంటుంది.

#Tags