US Republican Vice President: అమెరికా రిపబ్లికన్‌ ఉపాధ్యక్ష అభ్యర్థిగా ఆంధ్రా అల్లుడు.. ఆయన ఎవరంటే..?

రిపబ్లికన్‌ అమెరికా అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌.. ఉపాధ్యక్ష అభ్యర్థిగా ఒహియో సెనేటర్‌ జేడీ వేన్స్‌ని ఎంపిక చేసుకున్నట్లు ప్రకటించారు.

ఈ విషయాన్ని తన ‘ట్రూత్‌’ సోషల్‌ నెట్‌వర్క్‌ ద్వారా తెలిపారు. 39 సంవత్సరాల జేడీ వాన్స్‌ ఓ తెలుగు మూలాలున్న అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. 

జేడీ వేన్స్‌ సతీమణి ఉషా చిలుకూరి. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఆమె తల్లిదండ్రులు అమెరికాలోని శాన్‌డియాగోలో స్థిరపడ్డారు. 2014లో వేన్స్, ఉషల వివాహం జరిగింది. యేల్‌ లా స్కూల్లో వీరిద్దరు కలిసి చదువుకున్నారు. వీరికి ముగ్గురు సంతానం. నవంబర్‌లో జరిగే ఎన్నికల్లో ట్రంప్ గెలిస్తే వాన్స్ భార్య ఉషా చిలుకూరి వాన్స్ యునైటెడ్ స్టేట్స్‌ ఆఫ్‌ అమెరికా రెండో మహిళ చరిత్రలో నిలిచిపోతారు.

Modi in Russia: ఉక్రెయిన్‌ యుద్ధంపై ద్వైపాక్షిక చర్చలు జ‌రిపిన పుతిన్‌, మోదీ

#Tags