Industrial Smart Cities : 12 ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీలకు కేంద్ర క్యాబినెట్ ఆమోదముద్ర..
ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ఆగస్టు 29న జరిగిన కేంద్ర క్యాబినెట్‌లో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తెలుగు రాష్ట్రాలు సహా దేశవ్యాప్తంగా 12 ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీలకు కేంద్ర క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది. ఏపీ, తెలంగాణ, బిహార్, పంజాబ్‌లో 12 ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీలను అభివృద్ధి చేస్తారు. తెలంగాణలోని జహీరాబాద్‌లో 3245 ఎకరాల్లో ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీని అభివృద్ధి చేస్తారు. ఏపీలోని ఓర్వకల్లు, కొప్పర్తిలో ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీలు కొలువుతీరనున్నాయి.
Government Schemes : ప్రభుత్వ పథకాలను ప్రచారం చేస్తే నెలకు రూ.8 లక్షలు
ఓర్వకల్లులో 2621 ఎకరాల్లో ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ ఏర్పాటు కానుంది. కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ మంత్రివర్గ నిర్ణయాలను వెల్లడించారు. నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్‌మెంట్ ప్రోగ్రాం కింద దేశవ్యాప్తంగా 12 ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీలకు క్యాబినెట్ ఆమోద ముద్ర వేసిందని తెలిపారు. ఈ ప్రాజెక్టు కోసం ప్రభుత్వం రూ. 28602 కోట్లను వెచ్చించనుంది. ఈ ప్రాజెక్టుల ద్వారా ఏకంగా రూ. 1.5 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించవచ్చని కేంద్ర ప్రభుత్వం అంచనా వేస్తోంది.
SHe-Box Portal : మహిళల భద్రత కోసం షీ–బాక్స్ పోర్టల్.. సకాలంలో పరిష్కారం..