Kaziranga National Park: కజిరంగా నేషనల్ పార్క్ ప్రత్యేకతలు ఇవే..

ప్రధాన‌మంత్రి నరేంద్ర మోదీ మార్చి 9వ తేదీ అసోంలోని కజిరంగా నేషనల్ పార్క్‌ను సందర్శించారు.

కజిరంగా నేషనల్ పార్క్ భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధ జాతీయ ఉద్యానవనాలలో ఒకటి. ఒక కొమ్ము ఖడ్గమృగాలకు నిలయంగా ప్రసిద్ధి చెందిన ఈ పార్క్, పులులు, ఏనుగులు, బైసన్లు, జింకలు వంటి అనేక ఇతర జంతు జాతులకు నిలయం. దీనిని నవంబర్ నుంచి ఏప్రిల్ వరకు పర్యాటకులకు అందుబాటులో ఉంటుంది. మే 1 నుంచి అక్టోబర్ 31 వరకు మూసివేస్తారు.

దీనికి సంబంధించిన‌ కొన్ని ముఖ్య విషయాలు..
విస్తీర్ణం: 430 చదరపు కిలో మీటర్లు.
జంతు జాతులు: 1000కి పైగా జంతు జాతులు.
ప్రత్యేకత: ఒక కొమ్ము ఖడ్గమృగం (2200కి పైగా).
ఇతర జంతువులు: 180 బెంగాల్ పులులు, 1940 ఏనుగులు, 1666 అడవి బైసన్లు, 468 జింకలు.

ఈ పార్క్ చరిత్ర ఇదే..
1904: నాటి లార్డ్ కర్జన్ భార్య ఈ పార్క్ నమూనాను రూపొందించారు.
1905: రిజర్వ్ ఫారెస్ట్ ఏర్పాటు.
1985: యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు.
2006: టైగర్ రిజర్వ్‌గా ప్రకటన.

Underwater Metro: నీటి అడుగున నడ‌వ‌నున్న‌ మెట్రో రైలు..  

#Tags