New Criminal Law's : అమల్లోకి కొత్త న్యాయ చట్టాలు

దేశంలో కొత్త న్యాయ చట్టాలు జూలై 1వ తేదీ నుంచి అమలులోకి వచ్చాయి. ఇండియన్‌ పీనల్‌ కోడ్‌ (ఐపీసీ) స్థానంలో.. భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్‌); కోడ్‌ ఆఫ్‌ క్రిమినల్‌ ప్రొసీజర్‌ (సీఆర్‌పీసీ) స్థానంలో.. భారతీయ నాగరిక్‌ సురక్ష సంహిత (బీఎన్‌ఎస్‌ఎస్‌); ఇండియన్‌ ఎవిడెన్స్‌ యాక్ట్‌ స్థానంలో.. భారతీయ సాక్ష్యా అధినియం (బీఎస్‌ఏ).. అమలులో ఉండనున్నాయి. శిక్ష కంటే న్యాయం చేయడానికి ప్రాధాన్యతను ఇస్తూ కొత్త చట్టాలను చేసినట్టు కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా పేర్కొన్నారు. నేరాలపై సులువుగా ఫిర్యాదు చేసేలా ఈ–ఎఫ్‌ఐఆర్, జీరో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసే అవకాశం ఉంటుందని చెప్పారు.

Healthy Snacking Report: ఆరోగ్యకరమైన స్నాక్స్‌ వైపు మొగ్గు చూపుతున్న భారతీయులు!

#Tags