Modi opens 'in-space' office : ‘ఇన్‌–స్పేస్‌’ ఆఫీసు ప్రారంభించిన మోదీ

  • గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఇండియన్‌ స్పేస్‌ ప్రమోషన్, ఆథరైజేషన్‌ సెంటర్‌ (ఇన్‌–స్పేస్‌) మోదీ ప్రారంభించారు. అంతరిక్ష రంగంలో ప్రైవేట్‌ పెట్టుబడులను, నవీన ఆవిష్కరణలను ప్రోత్సహించాలన్న లక్ష్యంతో ఈ కేంద్రాన్ని నెలకొల్పారు. ఐటీ తరహాలోనే గ్లోబల్‌ స్పేస్‌ సెక్టార్‌లోనూ భారత సంస్థలు అగ్రగామికి ఎదగాలని ఆకాంక్షించారు.
  • అంతరిక్ష రంగంలో గతంలో ప్రైవేట్‌ సంస్థలకు ప్రవేశం లభించేది కాదని గుర్తుచేశారు. కానీ, తమ ప్రభుత్వం సంస్కరణలను తెరతీయడం ద్వారా ప్రైవేట్‌ రంగానికి స్వాగతం పలుకుతోందని తెలిపారు. స్పేస్‌ సెక్టార్‌లో సంస్కరణల ద్వారా అన్ని నియంత్రణలను, ఆంక్షలను తొలగించామని వివరించారు. ప్రైవేట్‌ రంగానికి ఇన్‌–స్పేస్‌ తగిన మద్దతు ఇస్తుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు.

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్(Telugu Current Affairs), స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా..
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

#Tags