India's Population: భారతదేశ జనాభా 144.17 కోట్లు!!
ఐక్యరాజ్యసమితి జనాభా నిధి (UNFPA) "స్టేట్ ఆఫ్ వరల్డ్ పాపులేషన్ 2024" నివేదికను విడుదల చేసింది.
దీని ప్రకారం భారతదేశ జనాభా 144.17 కోట్లకు చేరుకుంది. భారతదేశ జనాభా మరో 77 సంవత్సరాల్లో రెట్టింపు కానుంది. భారత్ పొరుగుదేశమైన చైనాలో జనాభా 142.5 కోట్లకు చేరింది.
ఈ నివేదిక ప్రకారం భారతదేశంలోని జనాభా విషయాలు ఇవే..
వయస్సు:
14 ఏళ్లలోపు వారు: 24%
10 నుంచి 19 ఏళ్లలోపు వారు: 17%
10 నుంచి 24 ఏళ్లలోపువారు: 26%
15 నుంచి 64 ఏళ్లలోపు వయసున్నవారు: 68%
65 ఏళ్లు దాటినవారు: 7%
పురుషుల సగటు జీవితకాలం: 71 సంవత్సరాలు
మహిళల సగటు జీవితకాలం: 74 సంవత్సరాలు
ఈ నివేదికలో భారతదేశ జనాభా పెరుగుదల రేటు నెమ్మదిగా తగ్గుతుందని కూడా పేర్కొంది. 2020 నుండి 2025 మధ్య కాలంలో భారతదేశ జనాభా వృద్ధి రేటు 1.1%గా ఉండే అవకాశం ఉంది.
Ram Lalla Silver Coin: అయోధ్య రాముడి వెండి నాణెం విడుదల.. ధర ఎంతంటే..
#Tags