Miss World Pageant: 28 ఏళ్ల తర్వాత భారత్‌లో మిస్‌ వరల్డ్‌ పోటీలు

భారత్‌ త్వరలో ఒక ప్రతిష్టాత్మక ఈవెంట్‌కు వేదిక అవనుంది.

2024 సంవ‌త్స‌రంలో జరిగే 71వ ప్రపంచ సుందరి పోటీలకు ఇండియా ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ మేరకు మిస్‌ వరల్డ్‌ ఆర్గనైజేషన్‌ తన అధికారిక ఎక్స్‌(ట్విటర్‌)లో ఖాతాలో ఈ విషయాన్ని వెల్లడించింది. మిస్‌ వరల్డ్ ఆర్గనైజేషన్‌ ఈ నిర్ణయంతో 28 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత మిస్‌ వరల్డ్‌ పోటీలకు భారత్‌ వేదికగా నిలవనుంది. చివరిసారిగా 1996లో బెంగళూరులో భారత్‌లో మిస్‌ వరల్డ్‌ పోటీలు నిర్వహించారు.

ఫిబ్రవరి 18 నుంచి మార్చి 9 వరకు ఢిల్లీలోని భారత్‌ కన్వెన్షన్‌ సెంటర్‌,  ముంబయిలోని జియో వరల్డ్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో మిస్‌ వరల్డ్‌ పోటీలు జరగనున్నాయి. మార్చి 9న నిర్వహించే మిస్‌ వరల్డ్‌ ఫైనల్‌ పోటీలను రాత్రి 7.30 గంటల నుంచి 10.30 గంటల వరకు ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించవచ్చు.

Pilot Training: కర్నూలు ఎయిర్ పోర్టులో పైలట్ శిక్షణ కేంద్రం.. టెండర్లకు గడువు ఎప్ప‌టివ‌ర‌కంటే..

కేవలం అందం మాత్రమే కాకుండా సేవా కార్యక్రమాల ద్వారా సమాజంలో సానుకూల మార్పును తీసుకొచ్చే సామర్థ్యం, తెలివితేటలు ఉన్నవారిని గుర్తించి సత్కరించడం దీని ముఖ్య ఉద్దేశం. గతంలో భారత్‌కు చెందిన ఐశ్వర్యరాయ్‌, ప్రియాంక చోప్రా, మానుషి చిల్లర్‌ తదితరులు మిస్‌ వరల్డ్‌గా ఎంపికయ్యారు.

 

 

#Tags