NDMA: కేంద్రం ప్రారంభించనున్న ఆపద మిత్ర కార్యక్రమం ఉద్దేశం?

జాతీయ విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ (ఎన్‌డీఎంఏ) సెప్టెంబర్‌ 28న న్యూఢిల్లీలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా మాట్లాడారు. ఎలాంటి విపత్తు సంభవించినా తక్షణం స్పందించేలా పౌరులకు శిక్షణ ఇచ్చేందుకు దేశవ్యాప్తంగా 350 జిల్లాల్లో ‘ఆపద మిత్ర’ కార్యక్రమాన్ని ప్రారంభించాలని కేంద్రం యోచిస్తోందని వెల్లడించారు. మంత్రి తెలిపిన వివరాల ప్రకారం... విపత్తులు సంభవించినప్పుడు తక్షణం ఎలా స్పందించాలి, ప్రజలను ఆపద నుంచి ఎలా కాపాడాలి వంటి విషయాలపై ఆపద మిత్ర కార్యక్రమంలో శిక్షణ ఇస్తారు. దీనికి సంబంధించి 28 రాష్ట్రాలతో కేంద్రం ఒప్పందం చేసుకుంది. వరదలు తరచూ సంభవించేందుకు అవకాశం ఉన్న 25 రాష్ట్రాల్లోని 30 జిల్లాల్లో చేపట్టిన ‘ఆపద మిత్ర’ పైలట్‌ ప్రాజెక్టు విజయవంతమైంది. ప్రాజెక్టులో పాలుపంచుకునే వారికి బీమా సౌకర్యం ఉంటుంది.

చ‌ద‌వండి: పాడి పరిశ్రమలో మహిళలకు సామర్థ్య శిక్షణ ప్రారంభం


క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : ఆపద మిత్ర కార్యక్రమాన్ని ప్రారంభించాలని కేంద్రం యోచిస్తోంది
ఎప్పుడు  : సెప్టెంబర్‌ 28
ఎవరు    : కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా
ఎక్కడ    : దేశవ్యాప్తంగా 350 జిల్లాల్లో...
ఎందుకు : విపత్తులు సంభవించినప్పుడు తక్షణం ఎలా స్పందించాలి, ప్రజలను ఆపద నుంచి ఎలా కాపాడాలి వంటి విషయాలపై పౌరులకు శిక్షణ ఇచ్చేందుకు...

#Tags