Anti Corruption: గురుగ్రాంలో జీ–20 దేశాల అవినీతి వ్యతిరేక వర్కింగ్‌ గ్రూప్ సదస్సు

పరారీలో ఉన్న ఆర్థిక నేరగాళ్లను రప్పించేందుకు ద్వైపాక్షిక సహకారం చాలదని, ఈ దిశగా దేశాలన్నీ ఉమ్మడిగా చర్యలు తీసుకుంటేనే ఫలితముంటుందని భారత్‌ పేర్కొంది.

ఈ విషయంలో ప్రస్తుతమున్న సంక్లిష్ట నిబంధనలు తదితరాలను తక్షణం సరళీకరించుకోవాలంది. మార్చి 1వ తేదీ హరియాణాలోని గురుగ్రాంలో మొదలైన జీ–20 దేశాల అవినీతి వ్యతిరేక వర్కింగ్‌ గ్రూప్‌ రెండు రోజుల సదస్సులో కేంద్ర సిబ్బంది శాఖ సహాయ మంత్రి జితేంద్రసింగ్‌ ఈ మేరకు సూచించారు. విజయ్‌ మాల్యా మొదలుకుని నీరవ్‌ మోదీ దాకా పలువురు ఆర్థిక నేరగాళ్లను రప్పించి చట్టం ముందు నిలబెట్టేందుకు భారత్‌ కొన్నేళ్లుగా ప్రయత్నిస్తున్న నేపథ్యంలో ఈ సూచన ప్రాధాన్యం సంతరించుకుంది. 

వీక్లీ కరెంట్ అఫైర్స్ (Awards) క్విజ్ (29 జనవరి - 04 ఫిబ్రవరి 2023)

‘‘ఇలాంటి ఆర్థిక నేరగాళ్లు విదేశాలకు తరలించిన మొత్తాలు ఉగ్రవాదం మొదలుకుని మనుషుల అక్రమ రవాణా తదితరాలకు వనరులుగా మారుతున్నాయి. అక్రమ ఆయుధాల వ్యాప్తికి, ప్రజాస్వామిక ప్రభుత్వాలను బలహీనపరచడానికీ ఉపయోగపడుతున్నాయి’’ అంటూ మంత్రి ఆందోళన వెలిబుచ్చారు. ‘‘అందుకే ఆర్థిక నేరగాళ్ల ఆస్తులను వీలైనంత త్వరగా ప్రభుత్వాలు రికవర్‌ చేసుకోవాలి. ఆ దిశగా ప్రపంచ దేశాలన్నీ పని చేయాలి.  జీ–20 దేశాలు ఇలాంటి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంచుకోవాలి’’ అని సూచించారు.

Zombie Drug: అమెరికాను వణికిస్తున్న జాంబీ డ్రగ్‌.. మనుషులను పిశాచులుగా మార్చేస్తుంది!

#Tags