Andhra Pradesh: ‘పొదుపు’లో ఏపీ నెంబర్‌ వన్.. బ్యాంకు రుణాల మంజూరులోనూ..

దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో స్వయం సహాయక సంఘాల బ్యాంకు లింకేజీ కార్యక్రమం, వాటి పనితీరుపై 2023–24 వార్షిక నివేదికను ఆగస్టు 10వ తేదీ నాబార్డు విడుదల చేసింది.

ఇందులో ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని స్వయం సహాయక సంఘాలు పొదుపు, క్రెడిట్‌ లింకేజి విషయంలోనూ దేశంలోనే నెంబర్‌ వన్‌ స్థానంలో నిలిచాయి. 
 
దేశంలోని ఈ సంఘాల పొదుపు ఆంధ్రప్రదేశ్‌లోనే అత్యధికంగా ఉందని నివేదిక స్పష్టం చేసింది. అంతకుముందు నాలుగేళ్లు కూడా ఏపీనే అగ్రగామిగా నిలిచింది. స్వయం సహా­యక సంఘాలకు రాష్ట్ర ప్రభుత్వం అందించిన సహాయ సహకారాలు, సున్నా వడ్డీ వంటి ప్రోత్సాహకాలతోనే ఇలా ఉత్తమ పనితీరు కనబరిచినట్లు నివేదిక స్పష్టంచేసింది. 

అన్ని రాష్ట్రాల్లో కలిపి పొదుపు సంఘాల సొ­మ్ము (­2­023–24 మార్చి నాటికి) రూ.6­5,0­89.15 కో­ట్లు అ­యి­తే.. ఇందులో దక్షిణాది రాష్ట్రాల పొదు­పు రూ.2­9,409.06 కోట్లు. ఇందులో ఆంధ్రప్రదేశ్‌లో­ని సంఘాల పొదుపు దేశంలోనే అత్యధికంగా రూ.17,292.16 కోట్లుగా ఉందని నివేదక వెల్లడించింది. అంటే దేశంలో మన రాష్ట్ర వాటా 26.56 శా­తంగా ఉంది. 

World Bank Report: భారత్‌ ఎదుర్కొంటున్న ఆర్థిక సవాళ్లు.. వరల్డ్ బ్యాంక్ సూచన ఇదే..

సగటు పొదుపు ఏపీలోనే అత్యధికం.. 
2023–24లో దేశంలోని మహిళా సంఘాల సగటు పొ­­దుపులో కూడా ఆంధ్రప్రదేశ్‌ అగ్రస్థానంలో ఉంద­­ని నాబార్డు నివేదిక స్పష్టంచేసింది. ఇక్కడ ఒక్కో సంఘం సగటు పొదుపు రూ.1,57,321లుగా ఉంది. బ్యాంకులు కూడా ఏపీ పొదుపు సంఘాలకే అ­త్య­ధి­కంగా రుణాలు మంజూరు చేస్తుండడంతో ఆంధ్ర­ప్రదేశ్‌ మొదటి స్థానంలో ఉందని తె­లిపింది. 

రాష్ట్రాల వారీగా చూస్తే.. 
2023–24లో బ్యాంకుల రుణాల పంపిణీలో రూ.59,777 కో­ట్ల­తో ఏపీ మొదటి స్థానంలో ఉండగా కర్ణాటక రూ.25,253 కోట్లతో రెండో స్థానంలో, తెలంగాణ రూ­.20,932 కో­ట్లతో మూడో స్థానంలో.. పశ్చిమ బెంగాల్‌ రూ­.20,671 కోట్లతో నాలుగో స్థానంలో ఉ­­న్నాయని ని­వేదిక వెల్లడించింది. ఒక్కో పొదుపు సంఘం స­గటు రుణ పంపిణీలోకూడా ఏపీ రూ­.­8.­8 లక్షలతో అగ్రస్థానంలో ఉందని, ఆ తరువాత కే­ర­ళ రూ.7.7 లక్షలు, తమిళనాడు రూ.6.7 లక్షలతో ఉన్నాయి. 

సున్నా వడ్డీతో సంఘాలు బలోపేతం 
ఇదిలా ఉంటే.. సకాలంలో రుణాలు చెల్లించే పొ­దు­పు సంఘాలకు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం సున్నావ­డ్డీ (వడ్డీలేని రుణాలు) రుణాలను అమలుచేసింద­ని కూడా నివేదిక పేర్కొంది. ఫలితంగా.. పొదుపు సంఘాలు బలోపేతం కావడమే కాక గ్రామీణ కు­టీ­­ర పరిశ్రమలు పరిపుష్టి సాధించాయని తెలిపింది.

GDP: 'జీడీపీ' అంటే ఏమిటి.. దీన్ని ఎలా లెక్కిస్తారో తెలుసా..?

#Tags