Government Schemes : ప్రభుత్వ పథకాలను ప్రచారం చేస్తే నెలకు రూ.8 లక్షలు

ప్రభుత్వ పథకాలకు ప్రచారం కల్పించడం ద్వారా ఇన్‌ఫ్లుయెన్సర్లు నెలకు రూ.8 లక్షల వరకు ఆర్జించవచ్చు.

ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలు, విజయాలకు ప్రచారం కల్పించేందుకు సోషల్‌మీడియా ఇన్‌ప్లుయెన్సర్లను యూపీ సర్కారు రంగంలోకి దించనుంది. ఈ మేరకు నూతన సోషల్‌మీడియా పాలసీని రూపొందించింది. దీని ప్రకారం.. ప్రభుత్వ పథకాలకు ప్రచారం కల్పించడం ద్వారా ఇన్‌ఫ్లుయెన్సర్లు నెలకు రూ.8 లక్షల వరకు ఆర్జించవచ్చు.

SHe-Box Portal : మహిళల భద్రత కోసం షీ–బాక్స్‌ పోర్టల్‌.. స‌కాలంలో ప‌రిష్కారం..

మరోవైపు, సోషల్‌మీడియాలో దేశ వ్యతిరేక పోస్ట్‌లు పెట్టేవారికి మూడేళ్ల జైలు శిక్ష నుంచి జీవిత ఖైదు వరకు శిక్ష విధించేలా నూతన పాలసీలో నిబంధనలు పొందుపరిచారు. దీనిపై ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. త్వరలో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సర్కారుకు ఓటమి తప్పదని, దీన్నుంచి ఏ సోషల్‌మీడియా వారియర్‌ కూడా రక్షించలేరని స్పష్టంచేశాయి.

Research Data of Chandrayaan 3 : ఇస్రో అందుబాటులోకి చంద్రయాన్‌–3 పరిశోధన డేటా

#Tags