APPSC Group-1,2: గ్రూప్‌–1,2 పరీక్షల‌కు ఉచిత శిక్షణ.. దరఖాస్తు చేసుకోండి..

ఏపీపీఎస్సీ గ్రూప్‌ 1, గ్రూప్‌–2 ప్రిలిమినరీ పరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్థులకు ఉచిత శిక్షణ కోసం అనంతపురం బీసీ స్టడీ సర్కిల్‌ వారు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు జిల్లా బీసీ సంక్షేమ, సాధికారత అధికారి నిర్మలాజ్యోతి తెలిపారు.

ఈ మేరకు డిసెంబ‌ర్ 18 (సోమవారం)న‌ ఓ ప్రకటనలో విడుదల చేశారు. గ్రూప్‌–2కు ఈ నెల 22 లోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. వంద మందికి ఈ నెల 27 నుంచి 45 రోజుల పాటు ఉచిత శిక్షణతో పాటు స్టైఫండ్‌, స్టడీ మెటీరియల్‌ అందజేస్తారు. గ్రూప్‌–1 అభ్యర్థులు ఈ నెల 31 లోపు దరఖాస్తు చేసుకోవాలి. 60 మందికి జనవరి 5 నుంచి 60 రోజుల పాటు ఉచిత శిక్షణతో పాటు స్టైఫండ్‌, స్టడీ మెటీరియల్‌ అందజేస్తారు.
డిగ్రీలో వచ్చిన మార్కులు, ప్రతిభ ఆధారంగా ఎంపిక చేస్తారు. బయోడేటాతో పాటు 10, ఇంటర్‌, డిగ్రీ మార్కుల లిస్టులు, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు (తల్లిదండ్రులకు రూ.లక్ష లోపు వార్షిక ఆదాయం ఉండాలి), ఆధార్‌, బ్యాంక్‌ పాస్‌ బుక్‌, రెండు పాస్‌పోర్ట్‌ సైజ్‌ ఫొటోలు జతపరచాలి. అనంతపురం పెన్నార్‌ భవన్‌ పక్కన ఉన్న బీసీ స్టడీ సర్కిల్‌ కార్యాలయంలో దరఖాస్తులు అందజేయాలి.

APPSC Group 1 & 2: ప్రణాళికతో చదివితే.. కొలువు సులువే.. గ్రూప్‌-1, 2లో విజేతలు మీరే..

#Tags