India World's Largest Democracy: భారత్‌ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం

అమెరికా భారతదేశాన్ని ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం అని గుర్తించింది.

ఈ దేశం ఎల్లప్పుడూ తమకు ఒక ముఖ్యమైన వ్యూహాత్మక భాగస్వామి అని స్పష్టం చేసింది. 

అమెరికా అధికార ప్రతినిధి మాథ్యూ మిల్లర్ భారత్‌లో ప్రజాస్వామ్యం వెనకబాటుతనం, ప్రతిపక్షాలపై అణచివేత గురించి మీడియా నుంచి ప్రశ్నలకు సమాధానం ఇస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. "భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. అమెరికాకు భారత్ చాలా ముఖ్యమైన వ్యూహాత్మక భాగస్వామి. మా రెండు దేశాల మధ్య బంధం మరింత బలంగా ఉండాలని ఆశిస్తున్నాను" అని ఆయన అన్నారు.

ఇటీవల భారతదేశం తమకు చాలా ముఖ్యమైన భాగస్వామి అని మిల్లర్ స్పష్టం చేశారు. భారతదేశం, అమెరికా మధ్య సంబంధాలు ఎల్లప్పుడూ బలంగా ఉండాలని ఆయన కోరుకున్నారు.

Rocket Force: ప్రపంచాన్ని వణికిస్తున్న రాకెట్‌ ఫోర్స్‌..!

#Tags