Switzerland Peace Summit: ఉక్రెయిన్‌లో శాంతికి ప్రాదేశిక సమగ్రతే ముఖ్య భూమిక

బెర్న్‌: ఉక్రెయిన్‌–రష్యా యుద్ధానికి ముగింపు పలికే దిశగా ఎలాంటి శాంతి ఒప్పందానికైనా ఉక్రెయిన్‌ ప్రాదేశిక సమగ్రతే ముఖ్య భూమిక అవుతుందని 80 దేశాలు తేలి్చచెప్పాయి.

ఉక్రెయిన్‌ ప్రాదేశిక సమగ్రతను, సార్వ¿ౌమత్వాన్ని తాము గౌరవిస్తున్నామని స్పష్టం చేశాయి. ఉక్రెయిన్‌లో శాంతి సాధన కోసం స్విట్జర్లాండ్‌లో రెండు రోజులపాటు జరిగిన సదస్సు జూన్ 16న‌ ముగిసింది.

దాదాపు 100 దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు. జూన్ 16న‌ 80 దేశాల ప్రతినిధులు ఉమ్మడిగా ఒక ప్రకటన విడుదల చేశారు. 

చదవండి: G7 Summit: ఈ దేశానికి రుణ ప్యాకేజీని ప్రకటించిన జీ7 దేశాల కూటమి!

భారత్‌ సహా కొన్ని దేశాలు ఈ ప్రకటనలో పాలుపంచుకోలేదు. తుది డాక్యుమెంట్‌పై సంతకం చేయలేదు. యుద్ధం మొదలైన తర్వాత స్వాదీనం చేసుకున్న ఉక్రెయిన్‌ భూభాగాలను వెనక్కి ఇచ్చేయాలని పలుదేశాలు రష్యాకు సూచించాయి.

స్విట్జర్లాండ్‌ సదస్సు పట్ల ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ హర్షం వ్యక్తం చేశారు. తమ దేశంలో శాంతికి ఇదొక తొలి అడుగు అని అభివరి్ణంచారు. అయితే, ఈ సదస్సుకు రష్యా మిత్రదేశం చైనా హాజరుకాలేదు. రష్యాను ఆహ్వా నించలేదు. భారత్‌ తరపున విదేశాంగ శాఖ కార్యదర్శి(పశి్చమ) పవన్‌ కపూర్‌ హాజరయ్యారు.   

#Tags