United Nations: ఐక్యరాజ్యసమితిలో రామకథా పారాయణం
రామచరిత మానస్‌ను ఆధ్యాత్మిక వేత్త మొరారి బాపు న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితి కార్యాలయంలో తొలిసారి రామకథా పారాయణం చేయనున్నారు.
ఐక్యరాజ్యసమితిలోని ప్రతినిధుల భోజనశాలలో తొమ్మిది రోజుల పాటు ఈ పారాయణం జరగనుంది.
శాంతిని పరిరక్షించడంతో పాటు మానసిక ఆరోగ్యానికి రామ కథలు మార్గం చూపుతాయన్నారు. రామాయణ సందేశాన్ని ప్రపంచవ్యాప్తంగా తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. ప్రపంచంలో సోదర భావాన్ని పెంపొందించి సరిహద్దులకు అతీతంగా ప్రజలను ఏకం చేయడమే లక్ష్యమన్నారు. రామచరిత మానస్‌ను ప్రముఖకవి తులసిదాస్ రచించారు.
గుజరాత్‌కు చెందిన మొరారి బాపు(77 ఏళ్లు) 60 సంవత్సరాలుగా శ్రీలంక, ఇండోనేసియా, దక్షిణాఫ్రికా, కెన్యా, యునైటెడ్ ఆస్ట్రేలియా, ఇజ్రాయెల్, జపాన్‌లతో సహా ప్రపంచవ్యాప్తంగా అనేక నగరాలు, పుణ్యక్షేత్రాల్లో రామకథలు పారాయణం చేస్తున్నారు.
International Law: పాలస్తీనాను అధీనంలో ఉంచుకోవడం చట్టవిరుద్ధం
#Tags