Deployment of Weapons: అంతరిక్షంలో ఆయుధాల మోహరింపు నిషేధంపై ఐరాసలో వీగిన రష్యా తీర్మానం

అంతరిక్షంలో సామూహిక జన హనన ఆయుధాలను నిషేధించాలంటూ.. గత నెలలో అమెరికా, జపాన్‌ ప్రవేశపెట్టిన తీర్మానం ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో వీగిపోయింది..

సాక్షి ఎడ్యుకేష‌న్‌: దీనికి ప్రతిగా అంతరిక్షంలో అన్ని రకాల ఆయుధాల మోహరింపును నిషేధించాలని రష్యా తీర్మానం ప్రవేశపెట్టింది. దీనిపై చర్చ సందర్భంగా ప్రపంచాన్ని తప్పుదోవ పట్టించాలని రష్యా చూస్తోందని అమెరికా, దాని మిత్ర దేశాలు ఆరోపించాయి.

Blue Residency Visa: ప‌ర్యావ‌ర‌ణ హితుల‌కు యూఏఈ 'బ్ల్యూ' రెసిడెన్సీ విసాలు..

రష్యా ఇటీవల ఒక ఆయుధాన్ని రోదసిలో ప్రవేశపెట్టిందన్నాయి. రష్యా దీన్ని ఖండించింది. మే 20న రష్యా తీర్మానంపై ఓటింగ్‌ జరగ్గా.. రష్యా, చైనా కూటమి నుంచి 7 ఓట్లు అనుకూలంగా; అమెరికా కూటమి నుంచి 7 ఓట్లు ప్రతికూలంగా పడ్డాయి. స్విట్జర్లాండ్‌ ఓటింగ్‌లో పాల్గొనలేదు. తీర్మానం నెగ్గడానికి కావలసిన 9 ఓట్లు రాకపోవడంతో అది వీగిపోయింది.

Kyrgyzstan: కిర్గిస్తాన్‌కు మనోళ్లు ఎందుకు వెళ్తున్నారు? అక్కడి కరెన్సీ విలువ ఎంత?

#Tags