New Banknotes: భార‌త భూభాగాల‌తో నేపాల్ కొత్త నోట్లు

భార‌త్‌, నేపాల్ మ‌ధ్య భూ వివాదం క్ర‌మంగా ముదురుపాకాన ప‌డుతోంది.

భాద‌త భూభాగాలైన కాలాపానీ, లిపులేఖ్‌, వింపియాధురా త‌మ‌వేన‌ని నేపాల్
వాదిస్తుంటుంది. వాటిని నేపాల్ భూభాగాలుగా పేర్కొంటూ 2020లోనే కొత్త పొలిటిక‌ల్ మ్యాప్‌ను రూపొందించుకుంది. పార్ల‌మెంటు కూడా దానికి ఆమోద‌ముద్ర వేసింది. భార‌త్ తీవ్ర అభ్యంత‌రాలు వ్య‌క్తం చేసినా నాటి నుంచీ అధికారిక వ్య‌వ‌హారాల్లో కొత్త మ్యాప్‌నే ఉప‌యోగిస్తూ వ‌స్తోంది.

తాజాగా కొత్త క‌రెన్సీ నోట్ల‌పై కూడా కొత్త మ్యాప్‌ను ముద్రించ‌డానికి నేపాల్ సిద్ధ‌మ‌వుతోంది. మేలోనే ఈ మేర‌కు నిర్ణ‌యం తీసుకుంది. ఆ నోట్లు ఆర్నెల్ల‌లో చెలామ‌ణీలోకి రానున్నాయి. సిక్కిం, ప‌శ్చిమ బెంగాల్, బీహార్‌, ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌, ఉత్తరాఖండ్ రాష్ట్రాలతో నేపాల్ 1,850 కిలోమీట‌ర్ల మేర స‌రిహ‌ద్దును పంచుకుంటోంది.

Most Expensive Coin: అత్యంత ఖరీదైన నాణేలు.. వందేళ్ల తర్వాత వేలానికి..!

#Tags