Sunitha Williams : వైర‌ల్ అవుతున్న సునితా విలియ‌మ్స్ ఫోటోపై నాసా వివ‌ర‌ణ‌.. తిరిగొచ్చేది!

ఐఎస్‌ఎస్‌కు వెళ్లేటపుడు పుష్టిగా ఉన్న సునీత తర్వాత బక్కచిక్కిపోయారని వార్తలొచ్చాయి.

వాషింగ్టన్‌: బోయింగ్‌ తయారీ స్టార్‌లైనర్‌ సంస్థ పంపిన రాకెట్‌లో ప్రొపల్షన్‌ వ్యవస్థలో లోపం కారణంగా భూమికి తిరిగిరాలేక అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్‌ఎస్‌)లో ఉండిపోయిన భార‌త సంత‌తి అమెరికా వ్యోమగామి సునీతా విలియమ్స్‌ ఆరోగ్యంపై సర్వత్రా సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఐఎస్‌ఎస్‌కు వెళ్లేటపుడు పుష్టిగా ఉన్న సునీత తర్వాత బక్కచిక్కిపోయారని వార్తలొచ్చాయి. 

Donald Trump : వీరిద్ద‌రికి కీల‌క ప‌ద‌వుల‌ను అప్ప‌గించిన ట్రంప్‌

బుగ్గలు నొక్కుకుపోయిన ఫొటో ఒకటి సామాజిక మాధ్యమాల్లో ప్రత్యక్షం కావడంతో చివరకు అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ(నాసా) వివరణ ఇవ్వక తప్పని పరిస్థితి ఎదురైంది. ముందస్తు సన్నద్ధత లేకుండా సుదీర్ఘకాలంపాటు భారరహిత స్థితిలో గడపడం వల్ల ఆమె ఆరోగ్యం దెబ్బతిన్నదని మీడియాతో కథనలు వెలువడటం తెల్సిందే. ఈ వార్తలను నాసా తాజాగా తోసిపుచ్చింది.

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

‘‘అక్కడి వ్యోమగాముల ఆరోగ్యస్థితిని ఫ్లైట్‌ సర్జన్లు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. అందరూ ఆరోగ్యంగా ఉన్నారు’’ అని నానా స్పేస్‌ ఆపరేషన్స్‌ మిషన్‌ డైరెక్టరేట్‌ అధికార ప్రతినిధి జిమ్మీ రస్సెల్‌ అన్నారు. ‘‘ఎనిమిది రోజుల్లో తిరిగొస్తారనుకుంటే ఆరునెలలపాటు అక్కడే ఉంచుతున్నారు. సుదీర్ఘకాలం భారరహిత స్థితిలో ఉంటే కండరాల క్షీణత బారిన పడే వీలుంది. ఎముకల పటిష్టత తగ్గుతుంది. పోషకాలలేమి సమస్యలు వస్తాయి’’ అని కొందరు వైద్యనిపుణలు అభిప్రాయపడటం తెల్సిందే. సునీతతోపాటు బేరీ బుచ్‌విల్మోర్‌ సైతం అదేరోజున ఐఎస్‌ఎస్‌కు వెళ్లిన విషయం విదితమే.

National Security Advisor : ట్రంప్‌కు జాతీయ భద్రతా సలహాదారుడిగా ఫ్లోరిడా కాంగ్రెస్ సభ్యుడు

కాగా, అంతరిక్షం నుంచి సునీతా విలియమ్స్‌ ఎప్పుడు తిరిగొస్తారనే దానిపై స్పష్టత కరువైంది. ఈ సంవత్సరంలో ఆమె భూమికి తిరిగొచ్చే అవకాశాలు లేవని తెలుస్తోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి ఆమె అంతరిక్షం నుంచి రావొచ్చని నాసా వర్గాలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలో సునీతా విలియమ్స్‌ ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన వ్యక్తమవుతోంది.

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

#Tags