Military Strength: ప్రపంచంలో టాప్ 10 శక్తివంతమైన సైనిక దళాలు ఉన్న దేశాలు ఇవే..

ప్రపంచ వ్యాప్తంగా మిలటరీ పరంగా అత్యంత శక్తిమంతమైన దేశం అమెరికా.

ఆ దేశం మొత్తం సైన్యం 21.27 లక్షలకుపైనే. ఆ దేశ మొత్తం యుద్ధ విమానాల సంఖ్య 13,209. ఆ తరవాతి స్థానాల్లో రష్యా, చైనా, భారతదేశం ఉన్నాయి. మనదేశంలో యుద్ధ విమానాల సంఖ్య 2,216. ఈ జాబితాలో పాకిస్థాన్ 9వ స్థానంలో ఉండటం విశేషం. 2024 సంవత్సరానికి ప్రపంచ రక్షణ సమాచారంలో ప్రత్యేకత కలిగిన డేటా వెబ్‌సైట్ గ్లోబల్ ఫైర్‌పవర్ సంస్థ విడుదల చేసిన వివరాల ప్రకారం..  

సైనిక శక్తి పరంగా టాప్-10 దేశాలు ఇవే.. 

ర్యాంకు దేశం పవర్ ఇండెక్స్ మొత్తం సైనిక సిబ్బంది (అంచనా) సైనిక వ్యయం
1 అమెరికా 0.0699 2,127,500 $831 బిలియన్
2 రష్యా 0.0702 3,570,000 $109.0 బిలియన్
3 చైనా 0.0706 3,170,000 $227 బిలియన్
4 భారత్ 0.1023 5,137,550 $74.0 బిలియన్
5 దక్షిణ కొరియా 0.1416 3,820,000 $44.7 బిలియన్
6 యునైటెడ్ కింగ్‌డమ్ 0.1443 1,108,860 $62.8 బిలియన్
7 జపాన్ 0.1601 328,150 $53 బిలియన్
8 టర్కీ 0.1697 883,900 $40.0 బిలియన్
9 పాకిస్తాన్ 0.1711 1,704,000 $6.3 బిలియన్
10 ఇటలీ 0.1863 289,000 $31.6 బిలియన్
#Tags