Kantara Oscar: ఆస్కార్ రేసులో కాంతారా

ప్రపంచంలోని సినిమా అవార్డుల్లో ప్రతిష్టాత్మకమైనది ఆస్కార్‌. ఈసారి ఆస్కార్‌ బరిలో పాన్ ఇండియా చిత్రాలుగా స‌త్తా చాటిన ఆర్ఆర్ఆర్‌, కాంతారా సినిమాలు బ‌రిలో నిలిచాయి.

‘బెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్‌’ కేటగిరీలో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ నుంచి ‘నాటు నాటు..’ పాట సెలెక్ట్ అయ్యింది. కాగా చిన్న సినిమాగా విడుదలై బాక్సాఫీస్‌లో సంచ‌ల‌నం సృష్టించిన కన్నడ చిత్రం ‘కాంతార’ ఆస్కార్ పోటీల జాబితాలో ఉత్తమ చిత్రం మరియు ఉత్తమ నటుడి(రిష‌బ్‌శెట్టి)గా అర్హత సాధించింది. ఇప్పటికే ఈ ఏడాది న్యూయార్క్‌ ఫిల్మ్‌ క్రిటిక్స్‌ సర్కిల్‌ వారి బెస్ట్‌ డైరెక్టర్‌ అవార్డును దర్శకుడు రాజమౌళి అందుకోగా, హాలీవుడ్‌ క్రిటిక్స్‌ అసోసియేషన్‌ జ్యూరీ స్పాట్‌లైట్‌ అవార్డును ‘ఆర్‌ఆర్‌ఆర్‌’కు ప్రకటించారు. 

#Tags