Global Hunger Index: ఆందోళనకర దేశాల జాబితాలో 105వ స్థానంలో ఉన్న భారత్

ప్రపంచ ఆకలి సూచీ (జీహెచ్‌ఐ) ఆధారంగా పోషకాహార లోపం, శిశు మరణాల పరంగా భారత్ ఆందోళనకర దేశాల జాబితాలో చోటు పొందింది.

127 దేశాలకు జీహెచ్‌ఐ ర్యాంకులు ఇవ్వగా, 27.3 స్కోర్‌తో భారత్ 105వ స్థానంలో ఉంది. ఈ నివేదికను కన్సర్న్ వరల్డ్‌వైడ్, వెల్త్ హంగర్ హిల్ఫే తాజాగా ప్రచురించాయి.

నివేదికలో పేర్కొన్నట్లు ఆకలి బాధతో తీవ్రంగా బాధపడుతున్న 42 దేశాలలో భారత్, పాకిస్థాన్, అఫ్గానిస్థాన్‌లతో పాటు నిలుస్తుంది. బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంక దేశాలు మధ్యస్థ కేటగిరీలో ఉండడం గమనించదగ్గ విషయం.

భారతదేశంలో 13.7% మంది పోషకాహార లోపంతో బాధపడుతున్నారని, ఐదేళ్లలోపు చిన్నారుల్లో 35.5% మంది వయసుకు తగ్గ ఎత్తు కంటే తక్కువగా ఉన్నారని, 18.7% మంది ఎత్తుకు తగ్గ బరువు లేనని నివేదిక తెలిపింది. చిన్నారుల్లో 2.9% మంది తమ ఐదో జన్మదిన వేడుకను చూడకుండా కన్నుమూస్తున్నారని సూచించింది.

Three Gorges Dam: భూ గమనాన్ని ప్రభావితం చేస్తున్న 'త్రీ గోర్జెస్‌ డ్యామ్‌'

ఈ ఫలితాల దృష్ట్యా 2030 నాటికి ఆకలి లేని సమాజాన్ని సాధించాలన్న ఐరాస లక్ష్యం చేరుకోవడం కష్టమేనని జీహెచ్‌ఐ నివేదిక అభిప్రాయపడింది.

#Tags